PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Saturday, June 7, 2014

పత్రిక మరియు ఆవిష్కరణ గురించిన వార్తలు తేది.07-06-2014

మా పాఠశాల పత్రికను ఆదర్శంగా తీసుకొని గుంటూరు జిల్లా వినుకొండ లో కేశవసూరి గారు ప్రారంభించిన స్నేహబాల పత్రిక

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

వార్త న్యూస్  


ఆవిష్కరణ సందర్భంగా, సాక్షి న్యూస్, తేది.07-06-2014

(www.snehabalavnk.blogspot.in)

.ఈనాడు న్యూస్,వినుకొండ





 

 

link to view this magazine : https://plus.google.com/116037828032615737055

  andhra prabha news


Thursday, November 28, 2013

prajasakti news,dt:27-11-2013























మా పాఠశాలలో నిర్వహించిన రామ్ లీలా పండుగ పోస్టర్



2014జనవరి నెల బాలభారతంలో మా పాఠశాలలో జరిపిన పండుగ గురించి
2014జనవరి నెల తెలుగు వెలుగు మాసపత్రిక లో బహుమతి పొందిన నా లేఖ


Thursday, September 12, 2013

తేది: 12-09-2013 న ఈనాడు దినపత్రికలో వార్త
























తేది:12-09-2013 న సాక్షి దినపత్రికలో వార్త


Sunday, June 10, 2012

సీరియల్ లో నా చిన్న పాత్ర (((బ్లూ షర్ట్ ,వైట్ ప్యాంట్ తో బోనులోకి సాక్షిగా వాచ్చే వ్యక్తిని.)))

మొదటి సారిగా నా టి.వి.రంగ ప్రవేశం " ఎదురీత " సీరియల్ లో ఒక చిన్న పాత్రతో ప్రారంభమైనది. మిత్రుడు తాతా రమేష్ బాబు గారి ఆత్మీయత వలన ది గ్రేట్ పర్సన్ చంద్రశేఖర్ ఆజాద్ గారిని పరిచయం చేయడంతో ఈ అవకాశం లభించింది. వారిద్దరికీ నేను సర్వదా కృతజ్ఞుడిని.

ఇక్కడ క్లిక్ చేయండి  సీరియలో నాపాత్ర

Monday, January 3, 2011

ETV2 తెలుగు‍-వెలుగు లో 2-1-2011 తేదిన ప్రసారమైన వృత్తి, సాహిత్య ప్రస్థానాలు

వీడియోను చూడాలంటే play బటన్ పై click చేయండి. పెద్దగా చూడాలంటే double click చేయండి.

Sunday, August 22, 2010

ప్రజాశక్తి లో నా కథ

దయ్యం(కథ) రచన: మద్దిరాల శ్రీనివాసులు, టీచర్, త్రిపురాంతకం
చిన్నారి డెస్కు, ప్రజాశక్తి Sat, 5 Jun 2010, IST కథ
చిట్టిపల్లె గ్రామంలోని శరత్‌, శ్రావణ్‌ ఇద్దరూ ఇరుగూపొరుగూ పిల్లలు. నాలుగు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కనే వున్న సింగంపల్లెలోని ఉన్నత పాఠశాలలో శరత్‌ 8వ తరగతి, శ్రావణ్‌ 7వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ మంచిమిత్రులు. ఏ పనిచేసినా, ఎక్కడికెళ్లినా దాదాపు కలిసే వుంటారు. వాళ్లిద్దరిలో శ్రావణ్‌ చాలా తెలివైనవాడూ, చురుకైనవాడు. కానీ, కాస్త దుడుకు స్వభావం కలవాడు. శరత్‌ మాత్రం చాలా నెమ్మదస్తుడు. తెలివితో పాటు ఏ విషయాన్నైనా నిదానంగా, తార్కికంగా, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేవాడు. ధైర్యం కూడా కాస్త ఎక్కువే.
ఒకరోజు వాళ్ల పాఠశాలలోని ఉపాధ్యాయులు, ఆసక్తిగలిగిన మరి కొందరు విద్యార్థులతో కలిసి నాగార్జునసాగర్‌ విహారయాత్రకు వెళ్లారు. వారిలో వీళ్ళిద్దరు కూడా వున్నారు. సాయంత్రం వచ్చేసరికి సూర్యాస్తమయం అయ్యింది. అయినా కాస్త వెలుతురు వుండడంతో చీకటిపడేలోపు పిల్లలను త్వరగా ఇళ్లకు చేరమని చెప్పి, ఉపాధ్యాయులంతా వెళ్లిపోయారు. కానీ, శరత్‌, శ్రావణ్‌ ఇద్దరూ సాగర్‌ విషయాల గురించి చర్చించుకుంటూ నిదానంగా నడవసాగారు. ఇంతలో చీకటిపడ్డ విషయాన్ని గమనించి, వెన్నెల వెలుతురులో వడివడిగా నడవసాగారు. వాళ్ల ఊరు నలభై అడుగుల దూరంలో వుండగా శ్రావణ్‌కు అనుకోకుండా దారిపక్క చింతచెట్టు వైపు చూపుమళ్లింది. వెంటనే ''అమ్మో! దెయ్యం!'' అంటూ శరత్‌ను గట్టిగా పట్టుకున్నాడు. ''ఎక్కడరా?'' అన్నాడు శరత్‌. ''అదిగో! అక్కడ. చూడు'' అంటూ చింత చెట్టుపైకి చూపించాడు.
అక్కడ రెండు చేతులతో కొమ్మలు పట్టుకొని వ్రేలాడుతూ నల్లని ఆకారం ఊగుతూ కనపడింది. తెల్లని కళ్లు మెరుస్తూ వున్నాయి. కనుగుడ్లు మాత్రం లేవు. కానీ, శరత్‌ ఏమాత్రం భయపడకుండా ఒక్కసారి కిందకు పరికించి చూశాడు. కిందివైపు ఒక తోకలాగా వుంది. ఎప్పుడో బడిలో సైన్సుమాష్టారు 'చీకటిలో దేనినైనా చూసినపుడు మన మనసులో ఏదైనా ఆకారాన్ని ఊహించుకుంటే, ఆ ఆకారమే మనకు కనపడుతుంది తప్ప, ఈ దెయ్యాలూ, భూతాలూ వుంటాయని చెప్పేదంతా నమ్మరాదని' చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే శ్రావణ్‌కు ఆ విషయం వివరించి, ధైర్యం చెప్పాడు. 'ఏం భయం లేదు. నాతో రా!' అంటూ శ్రావణ్‌ను పట్టుకొని నెమ్మదిగా అటు చూడకుండా ఇంటికి చేరారు.
ఇంటికి చేరిన వెంటనే శ్రావణ్‌ వాళ్ళ అమ్మకు విషయం చెప్పి, భయంతో 'నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా!' అంటూ, గట్టిగా కళ్లు మూసుకొని నిద్రపోయాడు. శరత్‌ మాత్రం ''ఆ ఆకారం ఏమైయుంటుందా?' అని ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం ఇద్దరూ బడికి బయలుదేరారు. దారిలో రాత్రి తాము చూసిన చెట్టును చూశాడు శరత్‌. అంతే ఒక్కసారిగా విరగబడి నవ్వసాగాడు. శ్రావణ్‌కు అర్థంకాక పైకి చూశాడు. వెంటనే అతనికీ నవ్వాగలేదు. అక్కడ చిరిగిపోయిన ఒక పాతగుడ్డ కొమ్మకు తగులుకుని వేలాడుతోంది. పైకి రెండు పీలికలు, కిందికి ఒకటి, మధ్యలో రెండు రంధ్రాలు. బహుశా ఆ రంధ్రాల్లో నుండి వెన్నెల మెరుస్తూ కనబడి వుంటుంది. చూడ్డానికి అచ్చం మనిషి వేలాడబడి, ఊగుతున్నట్లే వుంది. అప్పటి నుండి ఇక జీవితంలో ఎక్కడైనా 'దెయ్యం' వుందన్న మాట వినబడితే చాలు.. పొట్టచెక్కలయ్యేలా విరగబడి నవ్వడమే వీరి పని.

Tuesday, June 1, 2010

నేటి సాక్షి పేపర్ లో నా గురించి


01-06-2010నాటి సాక్షి దినపత్రిక లో

Thursday, May 6, 2010

నా ఆకాశవాణి ఆడియో ప్రసారాలు

1.నాటి,నేటి బాల్యం తల్లిదండ్రులు( ఆకాశవాణి,మార్కాపురం ద్వారా ప్రసారమైన నా రచన)


2.కార్మికుల సమస్యలు (ఆకాశవాణి,విజయవాడ ద్వారా ప్రసారమైన రచన)

http://rapidshare.com/files/384154817/karmikula_samasyalu.wma.html
3.స్త్రీల సమస్యలు (ఆకాశవాణి,విజయవాడ ద్వారా ప్రసారమైన రచన)

Thursday, April 29, 2010

ప్రజాశక్తి దినపత్రిక లో నా కథ

శకునాల గోపయ్య
Share Buzz up! చిన్నారి డెస్కు, ప్రజాశక్తి - మద్దిరాల శ్రీనివాసులు Sat, 17 Apr 2010, IST

శీనయ్య, గోపయ్య బట్టలను వాయిదా పద్ధతిలో అమ్మే వ్యాపారస్తులు. ఇద్దరూ మంచిమిత్రులు. అయితే గోపయ్యకు శకునాల పిచ్చి ఎక్కువ. శీనయ్యకు అలాంటి పట్టింపులు ఏమీలేవు.ఒకసారి ఇద్దరూ కలిసి పట్నం వెళ్లి రకరకాల బట్టలు కొని తెచ్చుకున్నారు. పల్లెలన్నీ తిరిగి వాయిదాలలో సొమ్ము చెల్లించే విధంగా బట్టలను అమ్ముకుని వచ్చారు. మరో వారంరోజులకు మిత్రులిద్దరూ మరలా వ్యాపారానికీ, బాకీ వసూళ్లకి బయలుదేరబోయారు. ఇంతలో ఎవరో ఠపీమని తుమ్మారు. వెంటనే గోపయ్య, ఛీ! ఛీ! అనుకుంటూ, 'శీనయ్యా! ఎవరో తుమ్మారు, శకునం బాగా లేదు, కాసేపు ఆగిపోదాములే! వుండు' అన్నాడు.స్నేహితుని మాట కాదంటే బాధపడతాడని కాసేపు ఆగి ఒకచోట కూర్చున్నారిద్దరూ. కొంచెం సేపయ్యాక మరలా ఇద్దరూ బయలుదేరబోయారు. కొంతదూరం పోయారో లేదో ఒక వితంతువు ఎదురు వచ్చింది. వెంటనే గోపయ్య. 'శివ! శివా!' అనుకుంటూ, 'ఒరే! శీనయ్యా! ఇవాళ శకునం బాగాలేదు గానీ, వ్యాపారానికి రేపు వెళదాం లే!' అన్నాడు. 'ఒరే! గోపయ్యా! నీకెన్నిసార్లు చెప్పాను. ఇలాంటివన్నీ పట్టించుకోవద్దనీ, ఇవి మన వ్యాపారానికి మంచిది కాదనీ, పద! బయలుదేరుదాం' అన్నాడు.కానీ, గోపయ్య వినిపించుకోకుండా, 'నీకూ నేను చాలాసార్లు చెప్పాను. ఇలాంటి శకునాలు మంచివి కావనీ. అయినా నీ కర్మ!' అంటూ వెనుదిరిగాడు. శీనయ్య మాత్రం అనుకున్న ప్రకారం వ్యాపారానికి బయలుదేరాడు. సాయంకాలానికల్లా తన బట్టలన్నీ చక్కగా అమ్ముకోవడంతోపాటు, గత వాయిదాల సొమ్ము కూడా చాలావరకూ వసూలు చేసుకుని మరీ వచ్చాడు.

తదుపరి వారం ఇద్దరూ కలిసి వ్యాపారానికి బయలుదేరి పోతుండగా ఈసారి దారిలో ఒక పిల్లి ఎదురైందని 'ఇదేం ఖర్మరా బాబూ!' అనుకుంటూ, 'ఒరే! శీనయ్యా! ఈసారైనా నా మాట వినరా! పిల్లి ఎదురవడం అస్సలు మంచిది కాదు. ఈరోజుటికి ఆగి పోదాం, పద' అన్నాడు.

'గోపయ్యా! ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు. పోయినవారం ఇలాగే నీవు వెనుదిరిగావు. ఏమైంది? నేనేమో, బాకీలు తెచ్చుకున్నాను, బట్టలన్నీ అమ్ముకున్నాను. నా మాట విని పద! వ్యాపారానికెళ్దాం' అంటూ స్నేహితునికి హితం చెప్పబోయాడు శీనయ్య.

కానీ, గోపయ్య.. 'ఒరే! శీనయ్యా! ఏదో ఒకసారికి నీకు మంచి జరిగి వుండొచ్చు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. దెబ్బతింటావు జాగ్రత్త! పెద్దల మాట చద్దన్నం మూట అన్నారు పెద్దలు. కాబట్టి ఈసారైనా నా మాట విని వెనుదిరుగు' అంటూ కాస్త కోపం కూడా ప్రదర్శించాడు.

ఇక లాభం లేదనుకుని శీనయ్య తన వ్యాపారానికి బయలుదేరాడు. 'పోరా! పో! అనుభవిస్తావు', అనుకుంటూ ఇంటికి వెళ్లాడు గోపయ్య.

ఇలా అప్పుడప్పుడూ శకునాలతో వెనుదిరగడం గోపయ్యకు పరిపాటి అయ్యిందేగానీ తన పద్ధతిని మాత్రం మార్చుకోలేదు. దానితో బాకీలు సకాలంలో వసూలుగాక, అప్పులతో వ్యాపారం చేయాల్సి వచ్చేది. చివరకు దివాళా తీశాడు. మూఢనమ్మకాలు లేని శీనయ్య మాత్రం మూడుపువ్వులు ఆరుకాయలుగా తన వ్యాపారం చేసుకుంటూ హాయిగా జీవించసాగాడు.