PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Sunday, December 2, 2018

అమరావతీ బాలోత్సవ్ వారి "బాలల రంగస్థలం" పుస్తకంలో నా రచనలు

తేది: 30-11-2018, శనివారము నాడు విజయవాడ లోని ఎం.బి.విజ్ఞాన కేంద్రం లో జరిగిన "బాలల రంగస్థలం" పుస్తకావిష్కరణ జరిగింది. ఆ సంకలనంలో... నా రచనలు.. నాలుగు.. 1) తెలుగు భాష (ఏకపాత్ర) 2) నేనూ చదువుకుంటా (నాటిక) 3) బాలకార్మికా బడి బాట పట్టరా (అభ్యుదయ గీతం) 4) పల్లె-పట్నం (జానపద గేయం) ... ప్రచురితమయ్యాయి. అమరావతి బాలోత్సవ్ కమిటీ వారు రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ నాలుగు అంశాలలో.. జరిగిన ఈ పోటీలలో నాలుగు అంశాలలో నేను పాల్గొన్నాను... నాలుగు రచనలకూ ఒక్కొక్క రచనకు రూ.1,000/- ల వంతున రూ.4,000లు పారితోషికమును ఇవ్వడం జరిగినది..