PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



20.బాధ్యులెవరు (బాలల కథల సంపుటి)





 



































 తేది:16-04-2026 న,  తెలంగాణ రాష్త్రం లోని ఖమ్మం జిల్లా ఖమ్మం డి.టి.ఓ. , ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ వెంటపల్లి సత్యనారాయణ గారు అందించిన  నా రచన  "బాధ్యులెవరు?" అనే కథల సంపుటి పై  సమీక్ష

                             బాధ్యులెవరు (బాలల కథల సంపుటి )పుస్తక సమీక్ష 

            ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  బాల సాహిత్యం పై విరివిగా రచనలు  చేస్తున్న ప్రముఖుల్లో మద్దిరాల శ్రీనివాస్ గారు ఒకరు. ఉపాధ్యాయుడుగా ఆయన తమ విద్యార్థులకు ఆదర్శమైన విద్యాబోధన  చేస్తూనే విద్యార్థులలో విజ్ఞానవికాసాలతో బాటు నీతి ప్రభోదకంగా బాల సాహిత్యం పై రంగమ్మ కల, మహంతి రాజ్యం, ఉల్లాసం ,నగర దిష్టి ,భాద్యులెవరు..,? విరిసిన మొగ్గలు, బాల గేయాలు, బాలలప్రపంచం లాంటి సుమారు 20 కి పైగా   రచనలు ఇప్పటివరకు వీరు రచించడం  జరిగింది . ఆయన రచించిన బాలల ప్రపంచం అనే గేయ సంపుటికి ఇటీవల నేను ముఖ చిత్రం వేసిన సందర్భంగా నాకు పంపించిన పై చిరు గ్రంథాలలో  భాధ్యులెవరు అన్న మకుటంతో వెలువరించిన బాలల కథా సంపుటి నేను మొదట చదవడం జరిగింది. ఈ కదా సంకలనం  నందలి కదల గురించి తొలుత  వివరిస్తాను 
       బాధ్యులెవరు అన్న పుస్తకంలో మొత్తం 12 కదలని ఆయన వెలువరించడం జరిగింది . ఇందులో తమ ఊరులో హైస్కూల్ చదువుకు ఆస్కారం  లేని కారణంగా చదువుకోసం  కూతురుని  బయటకు పంపడానికి ఇష్టం లేక బాల్య వివాహం చేసి  ఒకింటికి పంపేయాలనుకున్న తన తలిదండ్రుల ఆలోచననుండి తెలివిగాతప్పించుకొని తన మనసుకు నచ్చినవిదంగా  చదువును కొనసాగించిన అమ్మాయి కద   హక్కును కాపాడుకున్న అపర్ణ కధలో చూస్తాము 
కష్టకాలంలో ఆదుకునే వాడే నిజమైన మిత్రుడు అన్న వాస్తవాన్ని పాలు నీళ్ళ కలయికతో పోల్చి చెప్పిన చిన్న కధ నిజంగా సూక్ష్మంలో మోక్షంలా అనిపిస్తుంది. 
అలాగే మరోకధలో తల్లిదండ్రుల అతి గారభం కారణంగా విద్యార్ధి గా వున్న  కాలంలోనే స్థాయికి మించిన  దుభారా ఖర్చులకు అలవాటు పడ్డ కుర్రాడికి కష్టంతో సంపాదించిన డబ్బు యొక్క విలువ తెలిసేలా చేస్తారు  డబ్బు విలువ అన్న కధలో ,
 తాగుడు మత్తుమందులకు బానిసలై భార్యాపిల్లలను పట్టించుకోని కారణంగా చదువు సంధ్యలకు దూరమై పనిమనుషులుగా మారిన పిల్లల పరిస్థితికి భాధ్యులెవరు అని సూటిగా సమాజాన్ని ప్రశ్నిస్తాడు రచయిత  మరో కథలో 
సజ్జనుల మాటలు ఒక్కోసారి క్రూర జంతువులను సైతం  సాదువులుగా మార్చుతాయి అన్న  వాస్తవాన్ని గోమాంత్రి అన్న కధలో మనమందరం సాధారణంగా వినే ఆవు పులి కదకు భిన్నంగా చెప్పిన  తీరు బాగుంది.
 ఎప్పుడూ ఇతరులకు అపకారం చేయాలని తలంచే వ్యక్తికి ఆ అపకారాన్ని ఎదుర్కొన్న వ్యక్తి తిరిగి చేసిన ఉపకారం ఎదుటి వ్యక్తిలో ఎంతటి మార్పు తీసుకు వస్తుందో చెబుతుంది తనదాకా వస్తే అన్న కదలో.
 సమయం సందర్భం మనది కానప్పుడు పెద్ద పులి సైతం చిన్న బాతు పిల్ల  ముందు ఓడిపోయిన చందంగా లోకంలో  తానే అందరికన్న గొప్ప వాన్ననే అహంకారం  అన్నిచోట్లా అన్ని వేళలా పనికిరాదని నిరూపించిన కద” బుద్దితెచ్చుకున్న పులి”. 
       నిబద్దత గల ఉపాధ్యాయుడు కేవలం తన స్కూల్ పిల్లలనే కాక తన గ్రామాన్ని కూడా మార్చగలడు, పొట్ట గడవక కూలిపనులు చేసుకుంటున్న అమ్మాయిని  పట్టుదలతో చదివేలాచేసి  ఆ ఊరికే MPDO అయ్యేలా చేసిన ఒక ఉపాధ్యాయుడి గాధను  ఎల్లమ్మ MPDO అన్న కధలో చూస్తాము. ఈ కధ చదువుతుంటే ఈ కదా సంకలన రచయిత మద్దిరాల గారు గుర్తుకు వస్తారు కారణం 
               వృత్తి రీత్యా ఆయన ఒక ప్రాధమిక పాటశాల ఉపాధ్యాయుడు. పాటశాలలోని  అతని విద్యార్ధులు ఇంట్లో తమ తల్లి దండ్రుల వద్ద ఉన్నంత స్వేచ్చగా ఆడతారు పాడతారు గెంతులు కూడా వేస్తారు గుజరాత్ నందలి గిజుభాయి తత్వం ఇతని విద్యాభోదనలో మనకు కనిపిస్తుంది .సాధారణ రీతి భోధనకు ఎంతో భిన్నమైన రీతి భోధనకు అతను ఎన్నో పధకాలు రచిస్తాడు. జన్మతహా పిల్లల్లో  దాగిఉన్న శక్తులన్నీ వెలుపలకు తీసుకు రావడానికి అతడు బాలవికాసం అనే పత్రికను నడిపి దానిలో వారి విద్యార్దులు రాసిన కథలు గేయాలు బొమ్మలను ప్రచురించడమే గాకా  యు ట్యూబ్ వేదికగా కూడా పిల్లలచే పలు వీడియోలు చేసి  వారిలో ఆత్మవిశ్వాసం కలిగేలా చేయడంతో వాళ్ళు స్వేచ్చగా ఆనందంగా ఆయన వద్ద దేనినైనా అభ్యసనం చేస్తారు. ఒక విషయాన్ని ఎక్కడ మొదలెడితే వారికి సులభంగా అర్ధమౌతుందో అక్కడ ఆ పాట్యాంశాన్ని మొదలు పెట్టి క్రమ క్రమంగా జటిల విశయాలకు వెళ్ళడం ద్వారా ఎంతటి కష్టతరమైన విషయాన్నైనా  సులభంగా పిల్లలు నేర్వడానికి ప్రయత్నం చేస్తారు . 
          మద్దిరాల గారు రాసిన ఈ కదా సంకలనము నందలి కధలన్నీ చక్కని ఉదాహరణలతో విద్యార్ధులు ఆ కధలనందలి  నీతిని అర్ధం చేసుకునేలా 70 పేజీలలో ఉన్న ఈ బాల సాహిత్య గ్రంధం యొక్కవెల 120/- రూపాయలు . ప్రతి పాటశాలలో ఉండదగిన గ్రంధంను సొంతం చేసుకోవడానికి సంప్రదించవలసిన రచయిత యొక్క చిరునామా మద్దిరాల శ్రీనివాసు టీచర్ ,కవి ,రచయిత ఒంగోలు ,ప్రకాశం జిల్లా  పోన్ నెంబర్ 9010619066.

వెంటపల్లి సత్యనారాయణ 
                                                                                                                   9491378313