కళామిత్రమండలి, ఒంగోలు వారి ఆధ్వర్యములో తేది:20-10-2019న, ఎన్.టి.ఆర్.కళాక్షేత్రం, ఒంగోలులో హైదరాబాద్ వాసి శ్రీ భువనగిరి ఫణి పవన్ గారు నాకు సమర్పించిన "నవ్యకవితాకళానిధి" బిరుదము మరియు శ్రీ బి.వి.వి.శాస్త్రి స్మారక జాతీయ బాలసాహిత్య ప్రతిభా పురస్కారము. పత్ర సమర్పణ, శ్రీ భువనగిరి పురుషోత్తం, తెలుగు పండితులు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, మంగమూరు, సంతనూతలపాడు మండలము, ప్రకాశం జిల్లా... ...వీడియో వీక్షించుటకొరకు CLICK HERE
మద్దిరాల కు జాతీయ సాహిత్యపురస్కారం, నవ్యకవితాకళానిధి బిరుదు ప్రదానం
====================
తేది:20-10-2019, ఆదివారము నాడు "NTRకళాక్షేత్రం,ఒంగోలు" నందు "కళామిత్రమండలి " సాహితీవేదిక ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ సభలో..2019 సంవత్సరానికి గాను త్రిపురాంతకం మండలంలోని కంకణాలపల్లి ఉపాధ్యాయుడు, కవి, రచయిత శ్రీ మద్దిరాల శ్రీనివాసులు కు "శ్రీ బి.వి.వి.శాస్త్రి స్మారక సాహితీ పురస్కారము" తో పాటుగా "నవ్యకవితాకళానిధి" అన్న బిరుదమును కూడా ప్రదానం చేసి సత్కరించారు. ఈ పురస్కారమును ప్రముఖ సినీనటుడు గిరిబాబు గారి చేతుల మీదుగా అందుకున్నారు. . దశాబ్ద కాలమునకు పైగా మద్దిరాల శ్రీనివాసులు గారు దాదాపు 15 రకాల రచనా ప్రక్రియలలో కవితలు, పద్యాలు, పిల్లలనాటికలు మొ.నవి రచించారు. తన రచనలు ఒక ఉపాధ్యాయునిగా తన విద్యార్థులకు ఉపయోగిస్తూ చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రథమముగా తన తండ్రి కీ.శీ. బి.వి.వి.శాస్త్రి గారి జ్ఞాపకార్థము ఏర్పాటు చేసిన ఈ పురస్కారమును చంద్రునికో నూలుపోగుగా ఉత్తమ ఉపాధ్యాయుడు, కవి, రచయిత మద్దిరాల గారిని ఎంపిక చేసి అందజేసినట్లు శాస్త్రి గారి కుమారుడు ప్రదాత శ్రీ భువనగిరి ఫణి పవన్ గారు తెలిపారన్నారు. ఈ పురస్కారములో భాగముగా సన్మానపత్రము, శాలువా, పూలదండ, జ్ఞాపికలను అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భముగా మద్దిరాల శ్రీనివాసులుకు మండల విద్యాశాఖాధికారి మల్లికార్జున నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయు వుడుముల శ్రీనివాసరెడ్డి సహచర ఉపాధ్యాయులతో పాటు మండలం లోని పలువురు ఉపాధ్యాయులు కూడా అభినందనలు తెలిపారు.