PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



దేశభక్తి గీతాలు.- జానపదగేయాలు- గేయాలు...సేకరణ



















































































ఇంకా.. మరికొన్ని దేశభక్తి గీతాలను ఈ లింక్ పై క్లిక్ చేసి... పి.డి.ఎఫ్. రూపంలో చూడవచ్చు.. ప్రింట్ చేసుకోవచ్చు..

================================
జన జాగృత నవభారత మహోదయం
ఈ కనులతోనే కాంచుదాం
ఈ జీవితమున సాధించుదాం ||జన||

ప్రతి హృది లో దేశ భక్తి మోసులెత్త
నర నరాన నవచేతన వెల్లివిరియ
సమతాభావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన||

మన పూర్వుల మహనీయుల స్మరియించి
మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి
అహరహము శ్రమియించి జగతిన శిరమెత్తి నిలచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన||

ప్రాంత భాష కులమతాల కలతలతో
పలురీతుల బలహీనత లావరించె
అందరమొకటిగ నిలచి తరతమ భేదాలు మరచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన||

నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చుపెరిగి
అదనుచూచి కాటువేయ చూస్తున్నవి
జనతను జాగృతపరిచి ఎదఎదలో శక్తి నింపి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన||
=================================================

ఎడ్లు బాయె... గొడ్లు బాయె... ఎలమ దొరల మంద బాయే...
గోళ్ళగమ్మ నేను బోతె కందిరీగ కరిసి పాయె...
అరెరెరెరెరె ఆయ్
కోడిబాయె లచ్చమ్మదీ... కోడి పుంజు బాయె లచ్చమ్మదీ... ||2||
||ఎడ్లు బాయె||
||కోడిబాయె||
హోయ్
బండి బాయె బస్సు బాయె రేణిగుంట రైలు బాయె.... ||2||
మళ్ళి దిరిగి చూడ బోతె గాలి మోటరెళ్ళిపాయె... ||2||
అరెరెరెరె
దూడ బాయె లచ్చమ్మదీ... లేగ దూడ బాయె లచ్చమ్మదీ...||2||
||ఎడ్లు బాయె||
||కోడిబాయె||
కొండబాట నస్తుంటే.... కోయిలమ్మ గూస్తుంటే...
కొండబాట నస్తుంటె.... కోయిలమ్మ గూస్తుంటె...
వాగు బాట నస్తుంటే.. వాయిలాల సప్పుడాయె...
మందనంత గెదుముకుంట ఇంటిదారినొస్తుంటే...2
పోతుబాయె లచ్చమ్మదీ.. లేగ పోతుబాయె లచ్చమ్మదీ...||2||
||ఎడ్లు బాయె||
||కోడిబాయె||
లచ్చన్న దారి లోన లంబాడీ ఆటలాయె...హోయ్...
జిగులారి సంత లోన పోతలింగడి గంతులాయె
బంతి పూలు తెంప బోతె తుమ్మెదొచ్చి గరిసి బాయె
గంప బాయె లచ్చమ్మదీ పూల గంప బాయె లచ్చమ్మదీ.. ||2||
||ఎడ్లు బాయె||
||కోడిబాయె||
==========================================

పిల్లల పాటలు...            పిల్లల పాటలు...