PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Thursday, November 16, 2017

"బాలసుధ" వారి "జాతీయ ఉత్తమ బాలసేవక్ " బిరుదము

"మద్దిరాల" కు "జాతీయ ఉత్తమ బాలసేవక్ " బిరుదు ప్రదానం
==================
విజయనగరం జిల్లా లోగీస గ్రామానికి చెందిన "బాలసుధ" స్వచ్చంద సంస్థ వారు బాలల అభివృద్ధికై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో బాలలకు విద్యను బోధించడంతో పాటు, వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తూ.. నిరంతరం వారి సర్వతోముఖాభివృద్ధి కొరకై కృషి చేస్తున్న పలువురు ఉపాధ్యాయులకు, తమ సాహితీ రచనల ద్వారా పిల్లలలో నైతిక విలువలను పెంపొందించే  రచయితలకు గత 10 సంవత్సరాలుగా ఏటా కొందరిని "బాలసేవక్ " లుగా గుర్తించి ఆ సంస్థ అధినేత శ్రీ బండారు చిన్న రామారావు గారు సన్మానిస్తున్నది... ఈ కోవలో  2017 సంవత్సరానికి గాను అలాంటి జాతీయ స్థాయిలో సేవ చేస్తున్న 33 మంది ప్రముఖులకు "జాతీయ ఉత్తమ బాలసేవక్" అన్న బిరుదును ప్రకటించి సన్మానించినది.
వారిలో ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం లోని కంకణాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయుచున్న మద్దిరాల శ్రీనివాసులు గారు ఒకరు.. ఆ బిరుదు సన్మాన పత్రాన్ని పాఠశాలలో ఒక కార్యక్రమములో మండల విద్యాశాఖాధికారి శ్రీ కె.టి.మల్లికార్జున నాయక్ వీరికి అందజేశారు .
కార్యక్రమములో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎం.ఈ.ఓ.. ,మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా విద్యార్థులలో చిత్రలేఖనం, కథ, కవిత , వ్యాసము, మొ!! అనేక ప్రక్రియలకు సంబంధించిన సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు.. వారి ప్రతిభలను "బాలవికాసం" అనే ఒక త్రైమాస పత్రిక ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నారు.. అన్నారు.  వీరు నిజంగానే ఉత్తమ బాలసేవక్ అని కొనియాడుతూ, ఈ బిరుదు మద్దిరాల గారికి తగిన బిరుదేననీ, అభినందించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వుడుముల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ పత్రికలలో దాదాపు 25 మంది విద్యార్థుల కథలు, పద్యాలు ప్రచురితమైనవనీ,. త్వరలో వాటిని ఒక సంకలనంగా "విరిసిన మొగ్గలు" పేరుతో పుస్తక రూపములోకి కూడా తేవడానికి మద్దిరాల గారు కృషి చేస్తున్నారనీ,. వీరి బోధనా విధానమును  "నా తరగతి రాజ్యాంగము" పేరుతో రచించారనీ, ఆ పుస్తకమును మద్దిరాల గారే తన స్వంత ఖర్చు రూ. 12,000 లు వెచ్చించి వెయ్యి కాపీలు ముద్రింపజేశారనీ తెలిపారు. ఆ రచనను త్వరలోనే మండల కేంద్రములో ఎం.ఈ.ఓ..గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించబోతున్నామని తెలిపారు.
ఉపాధ్యాయులు అలగసాని, శ్రిష్టి శ్రీనివాసులు, మాధవి మాట్లాడుతూ తాను విద్యార్థులలో నైతిక వెలువలు పెంపొందించుటకై అనేక కథలు, పద్యాలు, వ్యాసాలు రచించారు. తాను రచనలు చేయడమే కాక విద్యార్థులచే రచింపజేస్తున్నారు... అలా పిల్లలు చేసిన రచనలను, బాలభారతం, కొత్తపల్లి, చెకుముకి, నాని లాంటి పలు మాసపత్రికలకు పంపి ప్రచురితమయ్యేలా కృషి చేస్తూ.. వారిని ప్రోత్సహిస్తున్నారన్నారని కొనియాడారు.. చెకుముకి మాసపత్రికకు సబ్ ఎడిటర్ గా కూడా పనిచేస్తున్నారని, ఇలాంటి ఉపాధ్యాయునితో పనిచేయడం చాలా సంతోషదాయకమనీ తమ ఆనందాన్ని పంచుకుంటూ ప్రశంసించారు. ఇంకా కార్యక్రమములో పాఠశాల విద్యాకమిటె చైర్మన్ శ్రీ బొమ్మనబోయున శ్రీనివాసులు, గ్రామస్తులు ఆంజనేయులు, నాగరాజు, డీలర్ సంజీవయ్య తదితరులు, ఉపాధ్యాయులు సురేషబాబు, సాగర్ బాబు, సుబ్రమణ్యం, నాగప్రమీల మరియు విద్యార్థులు కూడా పాల్గొన్నారు... జాతీయ ఉత్తమ బాలసేవక్ బిరుదాంకితులైన మద్దిరాలకు అభినందనలు తెలిపారు.
=================================



"సాక్షి" దినపత్రిక తేది: 16-11-2017న ప్రకాశం జిల్లా మెయిన్ 6వ పేజీలో న్యూస్