PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Monday, August 13, 2018

తెలుగు భాషా బ్రహ్మోత్సవాలలో సన్మానము

తేది:12-08-2018  , ఆదివారమునాడు ఒంగోలు లోని ఎన్.టి.ఆర్. కాళాక్షేత్రము లో జరిగిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాలలో జరిగిన కవి సమ్మేళనములో జరిగిన సన్మానము
===============
తేది: 15-08-2018 పత్రికా వార్తలు
=========================
EENADU DAILY PRAKASAM DISTRICT





































PRAJASAKTI NEWS











PAPER NEWS
============
తెలుగు భాషా సేవకుడు "మద్దిరాల"
==============================
తేది:12-08-2018  , ఆదివారమునాడు ఒంగోలు లోని ఎన్.టి.ఆర్. కాళాక్షేత్రము లో జరిగిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాలలో జిల్లాలోని ప్రముఖకవులతో  సమ్మేళనము ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత,సంస్కృతి ముఖ్య కార్యనిర్వహణాధికారి దీర్ఘాసి విజయభాస్కర్ గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ,   భవిష్యత్తులో తెలుగు భాషను బ్రతికించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు నిర్వహించ తలపెట్టిందన్నారు. ఇప్పటికి మూడు జిల్లాలో ఈ కార్యక్రమాలు చేశామని,  నాలుగవ జిల్లా ప్రకాశం అన్నారు. ఈ సమ్మేళనానికి జిల్లాలో వివిధ రచనలతో తెలుగు భాషకు సేవలు అందిస్తున్న ప్రముఖ కవులు 40 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. వారిలో త్రిపురాంతకం మండలం లోని, కంకణాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మద్దిరాల శ్రీనివాసులు ఒకరు. వీరు ఇప్పటి వరకు ఏకపాత్ర, నాటిక, పద్యకథ, గేయకథ, మొ!! వచన, గేయ,పద్య, కథా రచనలలో దాదాపు 20 కి పైగా  తెలుగు రచనా ప్రక్రియలలో తమ రచనలు చేసియున్నారు. అవన్నీ కూడా బాలల భాషాభివృద్ధికి తోడ్పడేవే కావడం విశేషం. అందుకే వీరిని ఈ సందర్భంగా సన్మానించినట్లు కవి, రచయిత మద్దిరాల తెలిపారు. ఇలాంటి గొప్ప సన్మానముకు ఎంపిక జేసినందులకు , నిర్వాహకులకు మద్దిరాల కృతజ్ఞ్తతలు తెలిపారు. ఈ సందర్భముగా మండల విద్యాశాఖాధికారి, శ్రీ తులసీ మల్లికార్జున నాయక్  మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వుడుముల శ్రీనివాసరెడ్డి, సిబ్బంది అభినందనలు తెలిపారు.
====================