ది:15-08-2017న వార్త దినపత్రిక లో నా గేయం
జాతీయ జెండా
ఎగిరింది.. ఎగిరింది..
నింగిపైకెగిరింది మన జెండా
జాతికే వెలుగునిచ్చె జాతీయ జెండా
నింగిపైకెగిరింది మన జెండా
జాతికే వెలుగునిచ్చె జాతీయ జెండా
త్యాగధనులనెందరినో గుర్తు తెచ్చు జెండా
స్వాతంత్య్రం తెచ్చిన మువ్వన్నెల జెండా
పింగళి వెంకయ్య రూపొందించిన జెండా
సార్వభౌమత్వాన్ని సూచించే జెండా
పిన్నలను, పెద్దలను ఆకర్షించే జెండా
అందరం గర్వంగా చెప్పుకునే జెండా
స్వాతంత్య్రం తెచ్చిన మువ్వన్నెల జెండా
పింగళి వెంకయ్య రూపొందించిన జెండా
సార్వభౌమత్వాన్ని సూచించే జెండా
పిన్నలను, పెద్దలను ఆకర్షించే జెండా
అందరం గర్వంగా చెప్పుకునే జెండా
దేశభక్తులందరినీ ఉప్పొంగించే జెండా
భారతీయులందరి జాతీయ జెండా
మన మదిలో త్యాగనిరతి ఏర్పరిచే జెండా
శాంత స్వభావం కలిగించే జెండా సమానత్వ భావనను పెంపొందించే జెండా
అందరిలో దేశభక్తి కలిగించే జెండా
కాషాయం, ఆకుపచ్చ రంగులున్న జెండా తెలుపు రంగు మధ్యలో కలిగున్న జెండా
అశోక ధర్మ చక్రాన్ని కలిగుండే జెండా
ధర్మాన్ని తప్పొద్దని సూచించే జెండా
సమిధలైన నాయకుల ప్రతిరూపమె జెండా
మన దేశానికి రూపాన్ని తెచ్చినదీ జెండా
మూడు రంగులు ఐక్యంగ కలిగిన ఈ జెండా
అందరినీ ఐక్యంగా ఉండమనే జెండా
మన మదిలో త్యాగనిరతి ఏర్పరిచే జెండా
శాంత స్వభావం కలిగించే జెండా సమానత్వ భావనను పెంపొందించే జెండా
అందరిలో దేశభక్తి కలిగించే జెండా
కాషాయం, ఆకుపచ్చ రంగులున్న జెండా తెలుపు రంగు మధ్యలో కలిగున్న జెండా
అశోక ధర్మ చక్రాన్ని కలిగుండే జెండా
ధర్మాన్ని తప్పొద్దని సూచించే జెండా
సమిధలైన నాయకుల ప్రతిరూపమె జెండా
మన దేశానికి రూపాన్ని తెచ్చినదీ జెండా
మూడు రంగులు ఐక్యంగ కలిగిన ఈ జెండా
అందరినీ ఐక్యంగా ఉండమనే జెండా
మద్దిరాల శ్రీనివాసులు