PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Sunday, December 24, 2017

స్నేహము గూర్చి నా పద్య రచన



డైట్ బ్యాచ్ గురించి...  నేను ఆ మిత్రులపై మరియు ప్రిన్సిపాల్ శ్రీ కే.పి.ఏ. చౌదరి గారిపై  నాకున్న అభిమానముతో రాసిన ఒక పేరడీ పాట... పైన ఉన్న పద్యములు కూడా.... ఆ ఆత్మీయ మిత్రుల గురించే.... మిత్రుడు , ప్రకాశం జిల్లా లోని  కంబం పట్టణం లోని ...విజేత హాస్పిటల్,  డాక్టర్ మహబూబ్ బాష కోరికపై... రాసిన పద్యాలే...



Saturday, December 16, 2017

ఆంధ్రప్రభ దినపత్రికలో తరగతి రాజ్యాంగము ఆర్టికల్

ఆంధ్రప్రభ దినపత్రికలో తేది: 16-12-2017న నా రచన తరగతి రాజ్యాంగము గురించి డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి పరిచయం చేసిన ఆర్టికల్









పైన తెలిపిన పుస్తకమును చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..

Wednesday, December 6, 2017

తెలుగంటే నాకిష్టం... గేయం






































audio tune for this song ..... please click the below link...
===================================================
https://www.youtube.com/watch?v=v4nVm_A3298&feature=youtu.be



Tuesday, November 21, 2017

రైతన్న దీనస్థితి పై పాట

చినుకమ్మ చినుకమ్మ చినుకమ్మా
నిన్ను నమ్ముకొంటిమమ్మ చినుకమ్మా
సమయపాలనెంచి రావమ్మా
నీ బిడ్డలను బ్రతుకనివ్వమ్మా
--------------------
విత్తనాలు నాట్లు వేస్తిమమ్మా
నీ రాక కోసమెదురు చూస్తిమమ్మా
కళ్ళు కాయలు గాసె చూడమ్మా
కాస్త కనికరమ్ము జూపి రావమ్మా !!చినుకమ్మ!!
----------------------
పగలనక రాత్రనక కష్టపడితిమమ్మ
తిండి తిప్పలు లేక తిరుగుచుంటిమమ్మ
వేళా పాళా లేక ఇంటిల్లిపాదిమి
పొలము పనులు చేయువారమమ్మా !!చినుకమ్మ!!
------------------
అందరి కోసం బ్రతికే వాళ్ళమమ్మా
అన్నదాతలము మేమమ్మా
నేల నీటి చుక్క లేదమ్మా
మమ్ము ఆదుకొనగ నీవు రావమ్మా  !!చినుకమ్మ!!
===================
రచన: మద్దిరాల., త్రిపురాంతకం






































ఈ పాటకు ఆడియో...  ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు నావే... నా అనుమతి లేకుండా ఎవరైనా నా రచనను ఏ ఇతర మీడియాలలో గానీ, తర్జుమాలకు గానే ఏ విధమైన తస్కరణ చేయరాదని, అలా చేసిన యెడల నేను వారిపై తీసుకొను ఏ కఠిన చర్యలకైనా వారే పూర్తి బాధ్యత వహించగలరని ఇందు మూలముగా హెచ్చరించుతున్నాను....



Thursday, November 16, 2017

రూ.1,116=00 లు బహుమతి పొందిన నా కథ

ఈ కథను చదవడానికి.....క్లిక్ చేయండి..

నెలవంక-నెమలీక " మాసపత్రిక వారు నిర్వహించిన సామాజిక కథల పోటీలో నేను రచించిన "రాజమార్గం" అనే కథకు కీ!!శే!! గోలి వెంకట్రామయ్య స్మారక పురస్కారము,  రూ.1,000 లు ప్రథమ  బహుమతి పొందినట్లుగా "బాలసాహితీశిల్పులు" అనే వాట్సాప్ గ్రూప్ లో తెలియపరచిన కాపీ.......



































నెలవంక-నెమలీక మాసపత్రికలో అత్యుత్తమ కథగా ఎంపికై ప్రచురితమైన నా కథ "రాజమార్గం" Jan 2018






తేది: 25-02-2018,న Sunday at Hyd  సన్మాన సందర్భంగా చాయాచిత్రములు మొమెంటో..
సాక్షి యర్రగొండపాలెం డివిజన్ పేపర్ లో 















ఈ సందర్భంగా పూసలపాడు లో నా వద్ద విద్యను నేర్చిన నా శిష్యుడు "బాలకృష్ణ " నన్ను కలిసిన దృశ్యం

ఇదే సందర్భములో నన్ను కలిసిన నా వాట్సాప్ పద్యశిష్యుడు, మహబూబ్ నగర్ , తెలంగాణ ఉపాధ్యాయుడు, కవి, రచయిత తగుళ్ళ గోపాల్..
ఈ సన్మాన సందర్భముగా నేను అక్కడ మాట్లాడిన నాలుగు మాటలు... వీడియోలో..







"బాలసుధ" వారి "జాతీయ ఉత్తమ బాలసేవక్ " బిరుదము

"మద్దిరాల" కు "జాతీయ ఉత్తమ బాలసేవక్ " బిరుదు ప్రదానం
==================
విజయనగరం జిల్లా లోగీస గ్రామానికి చెందిన "బాలసుధ" స్వచ్చంద సంస్థ వారు బాలల అభివృద్ధికై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో బాలలకు విద్యను బోధించడంతో పాటు, వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తూ.. నిరంతరం వారి సర్వతోముఖాభివృద్ధి కొరకై కృషి చేస్తున్న పలువురు ఉపాధ్యాయులకు, తమ సాహితీ రచనల ద్వారా పిల్లలలో నైతిక విలువలను పెంపొందించే  రచయితలకు గత 10 సంవత్సరాలుగా ఏటా కొందరిని "బాలసేవక్ " లుగా గుర్తించి ఆ సంస్థ అధినేత శ్రీ బండారు చిన్న రామారావు గారు సన్మానిస్తున్నది... ఈ కోవలో  2017 సంవత్సరానికి గాను అలాంటి జాతీయ స్థాయిలో సేవ చేస్తున్న 33 మంది ప్రముఖులకు "జాతీయ ఉత్తమ బాలసేవక్" అన్న బిరుదును ప్రకటించి సన్మానించినది.
వారిలో ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం లోని కంకణాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయుచున్న మద్దిరాల శ్రీనివాసులు గారు ఒకరు.. ఆ బిరుదు సన్మాన పత్రాన్ని పాఠశాలలో ఒక కార్యక్రమములో మండల విద్యాశాఖాధికారి శ్రీ కె.టి.మల్లికార్జున నాయక్ వీరికి అందజేశారు .
కార్యక్రమములో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎం.ఈ.ఓ.. ,మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా విద్యార్థులలో చిత్రలేఖనం, కథ, కవిత , వ్యాసము, మొ!! అనేక ప్రక్రియలకు సంబంధించిన సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు.. వారి ప్రతిభలను "బాలవికాసం" అనే ఒక త్రైమాస పత్రిక ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నారు.. అన్నారు.  వీరు నిజంగానే ఉత్తమ బాలసేవక్ అని కొనియాడుతూ, ఈ బిరుదు మద్దిరాల గారికి తగిన బిరుదేననీ, అభినందించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వుడుముల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ పత్రికలలో దాదాపు 25 మంది విద్యార్థుల కథలు, పద్యాలు ప్రచురితమైనవనీ,. త్వరలో వాటిని ఒక సంకలనంగా "విరిసిన మొగ్గలు" పేరుతో పుస్తక రూపములోకి కూడా తేవడానికి మద్దిరాల గారు కృషి చేస్తున్నారనీ,. వీరి బోధనా విధానమును  "నా తరగతి రాజ్యాంగము" పేరుతో రచించారనీ, ఆ పుస్తకమును మద్దిరాల గారే తన స్వంత ఖర్చు రూ. 12,000 లు వెచ్చించి వెయ్యి కాపీలు ముద్రింపజేశారనీ తెలిపారు. ఆ రచనను త్వరలోనే మండల కేంద్రములో ఎం.ఈ.ఓ..గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించబోతున్నామని తెలిపారు.
ఉపాధ్యాయులు అలగసాని, శ్రిష్టి శ్రీనివాసులు, మాధవి మాట్లాడుతూ తాను విద్యార్థులలో నైతిక వెలువలు పెంపొందించుటకై అనేక కథలు, పద్యాలు, వ్యాసాలు రచించారు. తాను రచనలు చేయడమే కాక విద్యార్థులచే రచింపజేస్తున్నారు... అలా పిల్లలు చేసిన రచనలను, బాలభారతం, కొత్తపల్లి, చెకుముకి, నాని లాంటి పలు మాసపత్రికలకు పంపి ప్రచురితమయ్యేలా కృషి చేస్తూ.. వారిని ప్రోత్సహిస్తున్నారన్నారని కొనియాడారు.. చెకుముకి మాసపత్రికకు సబ్ ఎడిటర్ గా కూడా పనిచేస్తున్నారని, ఇలాంటి ఉపాధ్యాయునితో పనిచేయడం చాలా సంతోషదాయకమనీ తమ ఆనందాన్ని పంచుకుంటూ ప్రశంసించారు. ఇంకా కార్యక్రమములో పాఠశాల విద్యాకమిటె చైర్మన్ శ్రీ బొమ్మనబోయున శ్రీనివాసులు, గ్రామస్తులు ఆంజనేయులు, నాగరాజు, డీలర్ సంజీవయ్య తదితరులు, ఉపాధ్యాయులు సురేషబాబు, సాగర్ బాబు, సుబ్రమణ్యం, నాగప్రమీల మరియు విద్యార్థులు కూడా పాల్గొన్నారు... జాతీయ ఉత్తమ బాలసేవక్ బిరుదాంకితులైన మద్దిరాలకు అభినందనలు తెలిపారు.
=================================



"సాక్షి" దినపత్రిక తేది: 16-11-2017న ప్రకాశం జిల్లా మెయిన్ 6వ పేజీలో న్యూస్ 




Saturday, September 16, 2017

సెప్టెంబర్ 2017 చెకుముకి మాసపత్రికలో నా కథ "రంగమ్మకల"


నేను ఊహించి రచించిన ఈ "రంగమ్మ కల" కథకు అనుగుణమైన వార్త... "way 2 sms" వార్తగా..... తేది:26 ఆగష్టు 2018 న వచ్చిన వాస్తవ కథనం. 






Sunday, September 3, 2017

డాక్టర్ రావి రంగారావు గారితో ఓ జ్ఞాపకం

తేది: 02-09-2017న గుంటూరు లోని ది సెంట్రల్ పబ్లిక్ స్కూల్ లో జరిగిన ఒక పద్య సమ్మేళనం లో ... ఓ జ్ఞాపకం డాక్టర్ రావి రంగారావు గారితో