PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Wednesday, August 22, 2018

చిత్రలేఖనము నేర్పుతూ.. వేసిన బొమ్మ ఇది..

నేను ఈ విద్యాసంవత్సరము.. 4వ తరగతి విద్యార్థులకు చిత్రలేఖనము నేర్పుతూ.. వేసిన బొమ్మ ఇది..

ఆనాటి నా సైకిల్...

నేను 1990 వ సంవత్సరములో.. తెలంగాణ రాష్ట్రం లో మంచిర్యాల వద్ద ఉన్న రామకృష్ణాపురం లోని బి.జోన్ అనే చోట శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసియున్నాను.. అప్పుడు.. నేను రూ..450/-  లకు కొన్న SECOND HAND సైకిల్ ఇది.. ఆనాటి నా జీతము... రూ.420/-.. అందుకే ఆరో, ఏడో ఇన్స్టాల్మెంట్స్ లో కొన్నాను.. అసలు original గా ఈ సైకిల్ యజమాని...దీనిని కొన్న 1975 వ సంవత్సరములో కొన్నట్లుగా.. నేను కొనేనాటికి ఈ సైకిల్ హ్యాండిల్ పై వ్రాయించి ఉన్నాడు.. దానిని నేను వాడుతున్నాను..


Monday, August 13, 2018

తెలుగు భాషా బ్రహ్మోత్సవాలలో సన్మానము

తేది:12-08-2018  , ఆదివారమునాడు ఒంగోలు లోని ఎన్.టి.ఆర్. కాళాక్షేత్రము లో జరిగిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాలలో జరిగిన కవి సమ్మేళనములో జరిగిన సన్మానము
===============
తేది: 15-08-2018 పత్రికా వార్తలు
=========================
EENADU DAILY PRAKASAM DISTRICT





































PRAJASAKTI NEWS











PAPER NEWS
============
తెలుగు భాషా సేవకుడు "మద్దిరాల"
==============================
తేది:12-08-2018  , ఆదివారమునాడు ఒంగోలు లోని ఎన్.టి.ఆర్. కాళాక్షేత్రము లో జరిగిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాలలో జిల్లాలోని ప్రముఖకవులతో  సమ్మేళనము ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత,సంస్కృతి ముఖ్య కార్యనిర్వహణాధికారి దీర్ఘాసి విజయభాస్కర్ గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ,   భవిష్యత్తులో తెలుగు భాషను బ్రతికించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు నిర్వహించ తలపెట్టిందన్నారు. ఇప్పటికి మూడు జిల్లాలో ఈ కార్యక్రమాలు చేశామని,  నాలుగవ జిల్లా ప్రకాశం అన్నారు. ఈ సమ్మేళనానికి జిల్లాలో వివిధ రచనలతో తెలుగు భాషకు సేవలు అందిస్తున్న ప్రముఖ కవులు 40 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. వారిలో త్రిపురాంతకం మండలం లోని, కంకణాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మద్దిరాల శ్రీనివాసులు ఒకరు. వీరు ఇప్పటి వరకు ఏకపాత్ర, నాటిక, పద్యకథ, గేయకథ, మొ!! వచన, గేయ,పద్య, కథా రచనలలో దాదాపు 20 కి పైగా  తెలుగు రచనా ప్రక్రియలలో తమ రచనలు చేసియున్నారు. అవన్నీ కూడా బాలల భాషాభివృద్ధికి తోడ్పడేవే కావడం విశేషం. అందుకే వీరిని ఈ సందర్భంగా సన్మానించినట్లు కవి, రచయిత మద్దిరాల తెలిపారు. ఇలాంటి గొప్ప సన్మానముకు ఎంపిక జేసినందులకు , నిర్వాహకులకు మద్దిరాల కృతజ్ఞ్తతలు తెలిపారు. ఈ సందర్భముగా మండల విద్యాశాఖాధికారి, శ్రీ తులసీ మల్లికార్జున నాయక్  మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వుడుముల శ్రీనివాసరెడ్డి, సిబ్బంది అభినందనలు తెలిపారు.
====================

Saturday, August 11, 2018

అమరావతీ బాలోత్సవ్ పోటీలలో బహుమతి పొందిన నా రచనలు..






































పైన తెలిపిన నాలుగు పోటీలకు నా రచనలు పంపియున్నాను.... ఆ నాలుగు పోటీలలోనూ నా రచనలు బహుమతి పొందినవి...
what app message..... 
---------------------------------------------
అమరావతి బాలోత్సవ్ 
నిర్వహించిన వివిధ రకాల పోటీలలో విజేతల పేర్లను
బాలోత్సవ్ కమిటీ నిర్వాహకులు
పిన్నమనేని మురళీ కృష్ణ గారు
విడుదల చేసారు....
 అభ్యుదయగీతాలు 
1.గరికపాటి మాస్టారు
2.బెలగాం భీమేశ్వరరావు
3.డా.రావెళ్ల శ్రీనివాసరావు
4.కలమటి సోమేశ్వరరావు
5.సవరం సాయి సుధ
6.యల్.రాజా గణేష్
7.మద్దిరాల శ్రీనివాసులు
8.యలమంచిలి కన్నయ్య
9.డా. జడా సుబ్బారావు
10. అలపర్తి   
       వెంకటసుబ్బారావు

 ఏక పాత్రలు 
1. డా.రావెళ్ల శ్రీనివాసరావు
2.ఓట్ర ప్రకాశరావు
3.గరికపాటి మాస్టారు
4.గరిమెళ్ళ వి.యస్.నాగేశ్వర
     రావు
5.మద్దిరాల శ్రీనివాసులు
6.మందపాటి వీర వెంకట రెడ్డి
7.రెడ్డి లలిత
8.బెహరా ఉమామహేశ్వరరావు
9.కోర్న్ భార్గవి
10. లెంక తులసి

 *జానపదగీతాలు* 
1.యం. వనజ
2.చేళ్ళపిళ్ల శ్యామల
3.యమ్. ఆలేఖ్య
4.గరిమెళ్ళ వి.యస్.నాగేశ్వర 
    రావు
5.మందపాటి వీర వెంకటరెడ్డి
6.అన్నంరాజు వేణుగోపాల     శ్రీనివాస మూర్తి
7.మద్దిరాల శ్రీనివాసులు

మిగతా వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించండి..
9912615747
9951540671
------------------------------------------







































.
నాటిక గెలుపొందినట్లుగా ఫోన్ చేసి తెలిపియున్నారు..







నాని పిల్లల మ్యాగజైన్ ఆగష్టు 2018 సంచికలో.. నా రచన "స్వత్రంత్రదినోత్సవం"గేయం