PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Sunday, August 22, 2010

ప్రజాశక్తి లో నా కథ

దయ్యం(కథ) రచన: మద్దిరాల శ్రీనివాసులు, టీచర్, త్రిపురాంతకం
చిన్నారి డెస్కు, ప్రజాశక్తి Sat, 5 Jun 2010, IST కథ
చిట్టిపల్లె గ్రామంలోని శరత్‌, శ్రావణ్‌ ఇద్దరూ ఇరుగూపొరుగూ పిల్లలు. నాలుగు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కనే వున్న సింగంపల్లెలోని ఉన్నత పాఠశాలలో శరత్‌ 8వ తరగతి, శ్రావణ్‌ 7వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ మంచిమిత్రులు. ఏ పనిచేసినా, ఎక్కడికెళ్లినా దాదాపు కలిసే వుంటారు. వాళ్లిద్దరిలో శ్రావణ్‌ చాలా తెలివైనవాడూ, చురుకైనవాడు. కానీ, కాస్త దుడుకు స్వభావం కలవాడు. శరత్‌ మాత్రం చాలా నెమ్మదస్తుడు. తెలివితో పాటు ఏ విషయాన్నైనా నిదానంగా, తార్కికంగా, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేవాడు. ధైర్యం కూడా కాస్త ఎక్కువే.
ఒకరోజు వాళ్ల పాఠశాలలోని ఉపాధ్యాయులు, ఆసక్తిగలిగిన మరి కొందరు విద్యార్థులతో కలిసి నాగార్జునసాగర్‌ విహారయాత్రకు వెళ్లారు. వారిలో వీళ్ళిద్దరు కూడా వున్నారు. సాయంత్రం వచ్చేసరికి సూర్యాస్తమయం అయ్యింది. అయినా కాస్త వెలుతురు వుండడంతో చీకటిపడేలోపు పిల్లలను త్వరగా ఇళ్లకు చేరమని చెప్పి, ఉపాధ్యాయులంతా వెళ్లిపోయారు. కానీ, శరత్‌, శ్రావణ్‌ ఇద్దరూ సాగర్‌ విషయాల గురించి చర్చించుకుంటూ నిదానంగా నడవసాగారు. ఇంతలో చీకటిపడ్డ విషయాన్ని గమనించి, వెన్నెల వెలుతురులో వడివడిగా నడవసాగారు. వాళ్ల ఊరు నలభై అడుగుల దూరంలో వుండగా శ్రావణ్‌కు అనుకోకుండా దారిపక్క చింతచెట్టు వైపు చూపుమళ్లింది. వెంటనే ''అమ్మో! దెయ్యం!'' అంటూ శరత్‌ను గట్టిగా పట్టుకున్నాడు. ''ఎక్కడరా?'' అన్నాడు శరత్‌. ''అదిగో! అక్కడ. చూడు'' అంటూ చింత చెట్టుపైకి చూపించాడు.
అక్కడ రెండు చేతులతో కొమ్మలు పట్టుకొని వ్రేలాడుతూ నల్లని ఆకారం ఊగుతూ కనపడింది. తెల్లని కళ్లు మెరుస్తూ వున్నాయి. కనుగుడ్లు మాత్రం లేవు. కానీ, శరత్‌ ఏమాత్రం భయపడకుండా ఒక్కసారి కిందకు పరికించి చూశాడు. కిందివైపు ఒక తోకలాగా వుంది. ఎప్పుడో బడిలో సైన్సుమాష్టారు 'చీకటిలో దేనినైనా చూసినపుడు మన మనసులో ఏదైనా ఆకారాన్ని ఊహించుకుంటే, ఆ ఆకారమే మనకు కనపడుతుంది తప్ప, ఈ దెయ్యాలూ, భూతాలూ వుంటాయని చెప్పేదంతా నమ్మరాదని' చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే శ్రావణ్‌కు ఆ విషయం వివరించి, ధైర్యం చెప్పాడు. 'ఏం భయం లేదు. నాతో రా!' అంటూ శ్రావణ్‌ను పట్టుకొని నెమ్మదిగా అటు చూడకుండా ఇంటికి చేరారు.
ఇంటికి చేరిన వెంటనే శ్రావణ్‌ వాళ్ళ అమ్మకు విషయం చెప్పి, భయంతో 'నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా!' అంటూ, గట్టిగా కళ్లు మూసుకొని నిద్రపోయాడు. శరత్‌ మాత్రం ''ఆ ఆకారం ఏమైయుంటుందా?' అని ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం ఇద్దరూ బడికి బయలుదేరారు. దారిలో రాత్రి తాము చూసిన చెట్టును చూశాడు శరత్‌. అంతే ఒక్కసారిగా విరగబడి నవ్వసాగాడు. శ్రావణ్‌కు అర్థంకాక పైకి చూశాడు. వెంటనే అతనికీ నవ్వాగలేదు. అక్కడ చిరిగిపోయిన ఒక పాతగుడ్డ కొమ్మకు తగులుకుని వేలాడుతోంది. పైకి రెండు పీలికలు, కిందికి ఒకటి, మధ్యలో రెండు రంధ్రాలు. బహుశా ఆ రంధ్రాల్లో నుండి వెన్నెల మెరుస్తూ కనబడి వుంటుంది. చూడ్డానికి అచ్చం మనిషి వేలాడబడి, ఊగుతున్నట్లే వుంది. అప్పటి నుండి ఇక జీవితంలో ఎక్కడైనా 'దెయ్యం' వుందన్న మాట వినబడితే చాలు.. పొట్టచెక్కలయ్యేలా విరగబడి నవ్వడమే వీరి పని.

Tuesday, June 1, 2010

నేటి సాక్షి పేపర్ లో నా గురించి


01-06-2010నాటి సాక్షి దినపత్రిక లో

Thursday, May 6, 2010

నా ఆకాశవాణి ఆడియో ప్రసారాలు

1.నాటి,నేటి బాల్యం తల్లిదండ్రులు( ఆకాశవాణి,మార్కాపురం ద్వారా ప్రసారమైన నా రచన)


2.కార్మికుల సమస్యలు (ఆకాశవాణి,విజయవాడ ద్వారా ప్రసారమైన రచన)

http://rapidshare.com/files/384154817/karmikula_samasyalu.wma.html
3.స్త్రీల సమస్యలు (ఆకాశవాణి,విజయవాడ ద్వారా ప్రసారమైన రచన)

Thursday, April 29, 2010

ప్రజాశక్తి దినపత్రిక లో నా కథ

శకునాల గోపయ్య
Share Buzz up! చిన్నారి డెస్కు, ప్రజాశక్తి - మద్దిరాల శ్రీనివాసులు Sat, 17 Apr 2010, IST

శీనయ్య, గోపయ్య బట్టలను వాయిదా పద్ధతిలో అమ్మే వ్యాపారస్తులు. ఇద్దరూ మంచిమిత్రులు. అయితే గోపయ్యకు శకునాల పిచ్చి ఎక్కువ. శీనయ్యకు అలాంటి పట్టింపులు ఏమీలేవు.ఒకసారి ఇద్దరూ కలిసి పట్నం వెళ్లి రకరకాల బట్టలు కొని తెచ్చుకున్నారు. పల్లెలన్నీ తిరిగి వాయిదాలలో సొమ్ము చెల్లించే విధంగా బట్టలను అమ్ముకుని వచ్చారు. మరో వారంరోజులకు మిత్రులిద్దరూ మరలా వ్యాపారానికీ, బాకీ వసూళ్లకి బయలుదేరబోయారు. ఇంతలో ఎవరో ఠపీమని తుమ్మారు. వెంటనే గోపయ్య, ఛీ! ఛీ! అనుకుంటూ, 'శీనయ్యా! ఎవరో తుమ్మారు, శకునం బాగా లేదు, కాసేపు ఆగిపోదాములే! వుండు' అన్నాడు.స్నేహితుని మాట కాదంటే బాధపడతాడని కాసేపు ఆగి ఒకచోట కూర్చున్నారిద్దరూ. కొంచెం సేపయ్యాక మరలా ఇద్దరూ బయలుదేరబోయారు. కొంతదూరం పోయారో లేదో ఒక వితంతువు ఎదురు వచ్చింది. వెంటనే గోపయ్య. 'శివ! శివా!' అనుకుంటూ, 'ఒరే! శీనయ్యా! ఇవాళ శకునం బాగాలేదు గానీ, వ్యాపారానికి రేపు వెళదాం లే!' అన్నాడు. 'ఒరే! గోపయ్యా! నీకెన్నిసార్లు చెప్పాను. ఇలాంటివన్నీ పట్టించుకోవద్దనీ, ఇవి మన వ్యాపారానికి మంచిది కాదనీ, పద! బయలుదేరుదాం' అన్నాడు.కానీ, గోపయ్య వినిపించుకోకుండా, 'నీకూ నేను చాలాసార్లు చెప్పాను. ఇలాంటి శకునాలు మంచివి కావనీ. అయినా నీ కర్మ!' అంటూ వెనుదిరిగాడు. శీనయ్య మాత్రం అనుకున్న ప్రకారం వ్యాపారానికి బయలుదేరాడు. సాయంకాలానికల్లా తన బట్టలన్నీ చక్కగా అమ్ముకోవడంతోపాటు, గత వాయిదాల సొమ్ము కూడా చాలావరకూ వసూలు చేసుకుని మరీ వచ్చాడు.

తదుపరి వారం ఇద్దరూ కలిసి వ్యాపారానికి బయలుదేరి పోతుండగా ఈసారి దారిలో ఒక పిల్లి ఎదురైందని 'ఇదేం ఖర్మరా బాబూ!' అనుకుంటూ, 'ఒరే! శీనయ్యా! ఈసారైనా నా మాట వినరా! పిల్లి ఎదురవడం అస్సలు మంచిది కాదు. ఈరోజుటికి ఆగి పోదాం, పద' అన్నాడు.

'గోపయ్యా! ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు. పోయినవారం ఇలాగే నీవు వెనుదిరిగావు. ఏమైంది? నేనేమో, బాకీలు తెచ్చుకున్నాను, బట్టలన్నీ అమ్ముకున్నాను. నా మాట విని పద! వ్యాపారానికెళ్దాం' అంటూ స్నేహితునికి హితం చెప్పబోయాడు శీనయ్య.

కానీ, గోపయ్య.. 'ఒరే! శీనయ్యా! ఏదో ఒకసారికి నీకు మంచి జరిగి వుండొచ్చు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. దెబ్బతింటావు జాగ్రత్త! పెద్దల మాట చద్దన్నం మూట అన్నారు పెద్దలు. కాబట్టి ఈసారైనా నా మాట విని వెనుదిరుగు' అంటూ కాస్త కోపం కూడా ప్రదర్శించాడు.

ఇక లాభం లేదనుకుని శీనయ్య తన వ్యాపారానికి బయలుదేరాడు. 'పోరా! పో! అనుభవిస్తావు', అనుకుంటూ ఇంటికి వెళ్లాడు గోపయ్య.

ఇలా అప్పుడప్పుడూ శకునాలతో వెనుదిరగడం గోపయ్యకు పరిపాటి అయ్యిందేగానీ తన పద్ధతిని మాత్రం మార్చుకోలేదు. దానితో బాకీలు సకాలంలో వసూలుగాక, అప్పులతో వ్యాపారం చేయాల్సి వచ్చేది. చివరకు దివాళా తీశాడు. మూఢనమ్మకాలు లేని శీనయ్య మాత్రం మూడుపువ్వులు ఆరుకాయలుగా తన వ్యాపారం చేసుకుంటూ హాయిగా జీవించసాగాడు.

Sunday, April 18, 2010

మీరు కోరుకున్న గేయాన్ని ఎలా వినాలా ? అని అనుకుంటున్నారా ?

ఇందులోని గేయాలను వినాలంటే ముందుగా మీరు వినాలనుకున్న గేయానికి క్రింద వున్న http// లింకు పై క్లిక్ చేయండి. అపుడు వచ్చే రెండు స్పీడోమీటర్ లలో free user అనే దానిపై క్లిక్ చేయండి. అపుడు download అని వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే open with file , save file అనే రెండు options వస్తాయి. అందులో save file పై క్లిక్ చేసి మీరు కోరుకున్న గేయాన్నిdownload చేసుకొని వినవచ్చును.

Tuesday, February 23, 2010

"విద్యాసంభందమైనవి"

  • ప్రకాశం జిల్లా బాల సాహిత్య రూపకల్పనలో సంపాదక సహా సభ్యుడుగా నిర్వహించడం
  • సర్వ శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ప్రాధమిక విద్యార్ధుల స్లిమ్ కార్డ్స్ రూపకల్పనలో సభ్యుడుగా మూడు సార్లు వెళ్లి రూపొందించి రావడం
  • ఉపాధ్యాయుల శిక్షణామాడ్యూల్ (క్లాప్స్) రైటర్ గా రాష్ట్ర స్థాయిలో , వరంగల్ లో పాల్గొని రూపొందించడం
  • జిల్లా స్థాయి లో ఏమ్మర్పీల మాడ్యూల్ ఎడిటర్ గా బాధ్యతల నిర్వహణ

రేడియో టీవీ ప్రసారాలు :

  • ఆకాశవాణి, మార్కాపురం లో ఉగాది కవి సమ్మేళనం లో పద్య పతన(౩ సార్లు )
  • ఆకాశవాణి, విజయవాడ లో కార్మికుల కార్యక్రమం లో స్త్రీలకార్మికుల సమస్యల ఫై రెండు సార్లు పద్యాలూ చదవడం
  • దూరదర్శన్, హైదరాబాద్ లో దాదాపు వందకు పిగా సమస్యా పూరణలు ప్రసారం

*ప్రశంసా పత్రములు*

  • డాక్టర్.సి.నా.రే. (సిని గేయ రచయిత) చే
  • డాక్టర్ . మల్లెమాల (సినీ నిర్మాత ) చే
  • పద్య భారతి , నిజామాబాద్ అధ్యక్షులు చే
  • వండర్ వరల్డ్ ఎడిటర్ గారిచే

సన్మానాలు:-

  • ఉగాది కవిసమ్మేళన సన్మానం (జిల్లా డి.ఇ.ఓ. మరియు జాయింట్ కలెక్టర్ల గార్లతో )
  • ఉగాది కవిసమ్మేళన సన్మానం (మార్కాపురం చెన్నకేశవ స్వామి దేవస్థానం వారితో )
  • ఆంధ్రపద్య కవితా సదస్సు , ఒంగోలు వారితో
  • జిల్లా ముస్లిం రచయితల సంఘం ,ఒంగోలు వారితో
  • ప్రకాశం జిల్లా రచయితల సంఘం , ఒంగోలు వారితో
  • తెలుగు వికాసం పురస్కారం
  • శ్రీ కృష్ణ దేవరాయ సాంస్కృతిక సాహిత్య సేవ సమితి , ఒంగోలు వారితో
  • ఆనందమయి సాహిత్య సేవ సమితి , ఒంగోలు వారితో

పొందిన అవార్డులు:-

  • మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
  • ఎయిర్ ఇండియా ,ముంబై వారి ర్యాంక్ అండ్ బోల్ట్ అవార్డు ,
  • తెలుగు-వెలుగు ,డిల్లి వారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు