PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



Tuesday, November 21, 2017

రైతన్న దీనస్థితి పై పాట

చినుకమ్మ చినుకమ్మ చినుకమ్మా
నిన్ను నమ్ముకొంటిమమ్మ చినుకమ్మా
సమయపాలనెంచి రావమ్మా
నీ బిడ్డలను బ్రతుకనివ్వమ్మా
--------------------
విత్తనాలు నాట్లు వేస్తిమమ్మా
నీ రాక కోసమెదురు చూస్తిమమ్మా
కళ్ళు కాయలు గాసె చూడమ్మా
కాస్త కనికరమ్ము జూపి రావమ్మా !!చినుకమ్మ!!
----------------------
పగలనక రాత్రనక కష్టపడితిమమ్మ
తిండి తిప్పలు లేక తిరుగుచుంటిమమ్మ
వేళా పాళా లేక ఇంటిల్లిపాదిమి
పొలము పనులు చేయువారమమ్మా !!చినుకమ్మ!!
------------------
అందరి కోసం బ్రతికే వాళ్ళమమ్మా
అన్నదాతలము మేమమ్మా
నేల నీటి చుక్క లేదమ్మా
మమ్ము ఆదుకొనగ నీవు రావమ్మా  !!చినుకమ్మ!!
===================
రచన: మద్దిరాల., త్రిపురాంతకం






































ఈ పాటకు ఆడియో...  ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు నావే... నా అనుమతి లేకుండా ఎవరైనా నా రచనను ఏ ఇతర మీడియాలలో గానీ, తర్జుమాలకు గానే ఏ విధమైన తస్కరణ చేయరాదని, అలా చేసిన యెడల నేను వారిపై తీసుకొను ఏ కఠిన చర్యలకైనా వారే పూర్తి బాధ్యత వహించగలరని ఇందు మూలముగా హెచ్చరించుతున్నాను....