PAGES

నా బ్లాగును దర్శి౦చుచున్న మీకు స్వాగత౦ ! సుస్వాగత౦ !!



NEW POSTS...

హైదరాబాదు కోడిహళ్ళి మురళీమోహన్ గారు,, నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించి.. ఆగష్టు 2022, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భముగా... ఈ పుస్తకములో.. అంత్యాక్షరి... టైపులొ... ముక్తపద గ్రస్త కావ్యము ముద్రించబోతున్నట్లు చెప్పి.. నాచే... "అంజలి"... అనే పదము తో ప్రారంభించి, "అమరజీవి " అనే పదముతో ముగిస్తూ.... న్యాపతి సుబ్బారావు అనే స్వాతంత్ర్య సమరయోధున్ని గురించి వ్రాయమనగా నేను రచించిన సీస పద్యము... 12 అక్టోబర్ 2021 న (నేను మెయిల్ ద్వారా సమ్మతి తెలిపినందుకు) నేను రచించిన పద్యము... 




హైదరాబాద్ , చెరుకూరి,దాట్ల వారి గురించిన పద్యాలు

=======================================================
ఇంటర్నెట్ లో నా బ్లాగు చూసి, నన్ను ఫోన్ ద్వారా సంప్రదించి.. వారికి సంబంధించిన పెద్దలు, చెరుకూరి వేంకటపతిరాజు, మరియు దాట్ల సత్యనారాయణ రాజు ల పదవీ విరమణ సన్మాన పత్రము కొరకు నన్ను పద్యములు వ్రాయమని వారి వారి చరిత్రల ముఖ్యాంశాలు పంపగా నేను రచించిన పద్యాలు... వారి మధుర గానంతో నా పద్యాలకే సొగసు విలువలు పెంచారు.. వారికి కృతజ్ఞతలు. 06 సెప్టెంబరు  2022  




on 15th August 2022, "Har Ghar Ka Tirangaa...." 







రేడియో శ్లోకం


Baabi Birthday video 




OUR GREAT LEADERS 




























https://www.youtube.com/watch?v=hYB63w04QnQ&t=58s

https://www.youtube.com/watch?v=ImhX6rd0LJY
























నా పెద్ద కుమారుడికి GATE 2021 లో INDIA 8th RANK..... వెంకట రాంప్రకాష్   link   https://transeasy.org/#







జూన్  2021 విశ్వధర్మవాణి మాసపత్రిక లో



తేది:22-05-2021 జీవ వైవిద్య దినోత్సవము సందర్భముగా... ప్రకాశం జిల్లా విద్యాశాఖ తరుపున నిర్వహించిన పాటల పోటీలలో నా పాటకు లభించిన ద్వితీయ బహుమతి ...... 
ఈ పాటను వీడియో రూపంలో వీక్షించుటకు ఇక్కడ క్లిక్ చేయండి



EVS certificate 

రెండవ training 1st certificate

1961-62 సంవత్సరం నాటి తెలుగు పంచాంగము  


ఒంగోలులో కొత్తగా చేరిన అద్దె ఇంట్లో (in Hall)  నా పురస్కారాల సర్దుబాటు... తేది: 22-01-2021




ఉన్నతపాఠశాలగా... కంకణాలపల్లి న్యూస్... మరియు విద్యామంత్రి ప్రకటించిన వీడియో క్లిప్
















తేది:21-11-2020, శనివారము, ఉదయం పాఠశాలలో సమావేశ సందర్భముగా..... గ్రామ సచివాలయ సిబ్బంది, social welfare & educational asst. శ్రీమతి చందన ప్రియ, engineering asst. బి.రాజేష్ ., వంటవారితో...


తేది:21-11-2020, శనివారము, హిందీ సార్ గృహప్రవేశ సందర్భముగా










MADDIRALA SREENIVASULU <maddiralatpkm@gmail.com>
6:10 AM (3 minutes ago) Dt:06-11-2020, Friday
vangurifoundation@gmail.com
====================
నమస్కారమండీ.... 7వ ప్రపంచ సాహితీ సదస్సు సభా విశేష సంచిక (Proceedings of the 7th International Telugu Literary Symposium”) లో ప్రచురణ కి నా  సమగ్ర ప్రసంగ వ్యాసం, ఫోటో, సంక్షిప్త పరిచయాలను పంపుతున్నాను...  అదే విధముగా.. నాకు  “ప్రశంసా పత్రం” జ్ఞాపిక , వృత్తి రీత్యానూ ఉపయోగపడే ఆ ధృవీ కరణ పత్రములను కూడా పంపగలరని సవినయంగా మనవి చేసుకొంటున్నాను.
===========================================================
నా సంక్షిప్త పరిచయ వాక్యాలు.
"నవ్య కవితా కళానిధి"  బిరుదాంకితుడనైన నా పేరు మద్దిరాల శ్రీనివాసులు, టీచర్‌, కవి,రచయితను. ప్రస్తుతము ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం లోని, కంకణాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేయుచున్నాను.  ఇప్పటి వరకు. గేయకవిగా ... 100 కు పైగా గేయాలను. పద్య కవిగా ...  2000 కు పైగా పద్యాలను  కథా రచయితగా ...60 పైగా కథలను. ...రచించాను.. ఆకాశవాణి లో  పద్యాలు, కథానికలు, వ్యాసాలు వినిపించాను. ఇప్పటి వరకు.... 1) బాలల గేయాలు-1....2) బాలల గేయాలు-2.......3) సుబ్బరాయ శతకము (నీతి పద్యాలు)4) బాలరాజ శతకము ( పొడుపు పద్యాలు), 5) రామ శతకము ( నీతి పద్యాలు) 6) సరసానందహరి (నా  సమస్యాపూరణలు)  7) తరగతి రాజ్యాంగము (నా తరగతి బోధనా విధానము) 8) నగర దిష్టి ( కథా సంకలనము )
( విశాలాంధ్ర పబ్లికేషన్స్‌ ప్రచురణ)9) విరిసిన మొగ్గలు ( నా విద్యార్థుల కథల సంకలనం)10) కంకణాలపల్లి విద్యార్థుల సాహితీ ప్రతిభ11) దండక రత్నాలు (శ్రీ వేంకటేశ్వర స్వామి, గోదాదేవి దండకాలు) అనే సాహిత్య పుస్తకాలు ముద్రించబడినవి.  ఇంకా 1)  రెండు కథల సంకలనాలు, 2)బాలలగేయాలు-౩, 3) సులభంగా పద్యం ఎలా?, 4) హితోక్తులు(పద్యరచనలు),  5)సమస్యాపూరణ తోరణం, 6)రేడియో ప్రసారాలు,     7)పిల్లల నాటికలు, 8)ఉపాధ్యాయుడిగా నేను (బోధనా పద్ధతులు), 9)మణిపూసల సంకలనం, 10)వచన కవితా సంకలనము, 11)త్రిపురాంతక క్షేత్ర మహిమ (బాలల సంభాషణల సాహిత్యము), 12)తెలుగులో గుండ్రటి వ్రాత సాధించడం ఎలా? (విశ్లేషణ) అముద్రితాలుగా ఉన్నవి.  వివిధ సాహితీ సంస్థల నుండి దాదాపు 25కు పైగా సన్మానాలు మండల , జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 3వ తెలుగు పాఠ్యపుస్తక రచయితను. నా ఇంటర్నెట్‌ బ్లాగ్‌లు : 1) www.maddiralasreenivasulu.blogspot.com 2) www.baalavikaasam.blogspot.com...     YOU TUBE CHANNEL LINK  : https://www.youtube.com/c/MaddiralaSreenivasulu/videos
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వేదిక జరిగిన తేది: 31-10-2020, శనివారము... మూడవ వేదిక
నా  ప్రసంగ వ్యాసము : తెలుగు భాష - పాఠశాల స్థాయి విద్యార్థులు....
(తెలుగు అభివృద్ధి జరగడానికి మనం చేయాల్సినది ఏమిటి?)
========================
తేటగీతి పద్యము
------------------------
శ్రీ వినాయక! భారతీ! శిరము వంచి
మ్రొక్కెదను కరములు మోడ్చి నిక్కముగను
తెలుగు భాష జగతినందు వెలుగ సతము
గొనుమ ‘మద్దిరాల’కవియున్‌ వినతి దెల్పె
-----------------------------------------------------------------
చంపకమాల పద్యము
--------------
పలు పలు రీతులన్‌ దెలుగు పద్ధతున్‌ గని తెన్గు భాషకున్‌
విలువలు బెంచగాను తను పెక్కుగ మెప్పుగ రాజుగారు సే
వలనిడుచుండె, మీకివియె వందనముల్‌ గొనుమా! మహాశయా!
పలు సహకారమున్నిడెడి వారికి సైతము వందనాలివే!
-----------------------------------------------------------------
నేటి ఈ వేదిక  నిర్వాహకులకు,  వేదికలోనున్న పండిత సాహితీ మిత్రుందరికీ పేరుపేరునా నా ప్రణామాలు. ప్రపంచంలోనున్న వేలాది భాషలో మన తెలుగు భాష చాలా గొప్పదన్న సంగతి విదితమే.  నాకు తెలిసినంతలో మన తెలుగు భాషకున్నంత పెద్ద అక్షరమాల గానీ, సాహితీ ప్రక్రియలు  గానీ, మన భాషకున్నంత కమ్మదనం గానీ, సొగసు గానీ ఏ ఇతర భాషకూ లేవని అనుకుంటున్నాను.  
మన తెలుగు భాషాభివృద్ధికోసం  కృషి సల్పుతున్న  శ్రీ వంగూరి చిట్టెం రాజు గారికి అభినందనలు. ఈ వేదికలో నేను ముఖ్యంగా మూడే మూడు విషయాల గురించి మాట్లాడదలచుకున్నాను.
1. వాట్సాప్‌ లోనూ మరియు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి వేదికలలో వీక్షకులు తమ స్పందనలను,  థ్యాంక్యూ/Thank you , ఎక్సలెంట్‌/Excellent,  గుడ్‌/Good, నైస్/Nice....  ఇలాంటి ఆంగ్ల పదాలను వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే తెలుగు వెలుగుకు కాస్తైనా సేవ చేసిన వారము అవుతామని భావిస్తున్నాను.
కొందరైతే......  తెలుగు పదాలను...... ఆంగ్ల అక్షరాలు ఉపయోగించి వ్రాస్తుంటారు.. ఇది మరీ బాధాకరము... అదెలాగంటే.... ఉదాహరణకు ‘‘చూడండి’’ అనే పదముకు బదులుగా....  ‘‘ chudandi’’  గా అని, ..... బాగుంది..... అనే పదానికి..............bagundi.... ఇలా రాస్తుంటారు.  ప్రయత్నం చేస్తే బాగుంటుందని మనవి.
హాయిగా........ చక్కగా మన మనసులోని సంపూర్ణ భావాలను తెలుపుటకు...  ధన్యవాదములు, ధన్యవాదములండీ,  కృతజ్ఞతలు, కృతజ్ఞతలండీ,  చక్కగా ఉన్నది,  అమోఘము, ఆనందకర విషయము, వందనాలు, నమస్కారములు, చాలా సంతోషము, వినడానికి హాయిగా ఉన్నది, తృప్తిగా అనిపిస్తున్నది.. .....ఇలాంటి ఎన్నో  పదాలను వాడుతూ ఉండవచ్చు..  తెలుగు భాషతో పాటు, తెలుగు బంధాన్ని మరింతగా పెంచుకోవచ్చును..  తెలుగు విలువను నిలబెట్ట వచ్చును. మాతృభాషలో... అందులోనూ మన తెలుగు వాడకంలో ఉన్నంత హాయి మరే భాషలోనూ ఉండదు గాక ఉండదు.
2.ఇటీవలి కాలంలో ధనార్జనే ధ్యేయంగా, వ్యాపార దృక్పథంతో కొన్ని సాహితీ వేదికలు పుట్టుకురావడం శోచనీయం.  (ఈ సంస్థ కాదు). వాటి వలన సాహిత్యానికి విలువ పోతున్నది. రుసుములు వసూలు చేసి, సన్మానాలు బిరుదాలు ఇవ్వడం ఇంకా ఘోరంగా అనిపిస్తున్నది. అలాంటి కార్యక్రమాల్లో ప్రేక్షకులందరూ.. సన్మాన గ్రహీతలే....  అలాంటి వాటిని సాహితీ సభలు అంటారా? మిత్రులు ఆలోచించండి.  ఇదే బాధాకరమనుకుంటే వారిచ్చే బిరుదాలను చూద్దామా..... అంటే, సాహితీ రత్న, సహస్ర కవీంద్రుడు, సహస్ర మణిరత్న, కవిచంద్ర, కవిరత్న, ఇలా ఉంటున్నాయి. అది కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిల్లోనే....  అంటే, రాష్ట్రాలు, దేశము,  సాహిత్యరత్న, మణిరత్న లాంటి బిరుదాంకితలతో నిండిపోతోంది. ఇలాంటి పరిస్థితిలో తెలుగు వెలుగుతుందంటారా? ఇలాంటి వారి చేతలను ఏమనుకోవాలో...? అర్థము కావడం లేదు.... ఆమధ్య ఒక సంస్థవారు ఒక రాష్ట్రంలో... మన ప్రాచీన కవి విశ్వనాథ సత్యనారాయణ గారి ‘‘ కవిసమ్రాట్‌ ’’ బిరుదాన్నే  పలువురికి పంపకం చేసినట్లు వాట్సాప్‌లో ప్రకటన వచ్చింది. (నవ్యాంధ్ర రాష్ట్రం లో కాదు) ఎంత దారుణమండీ! విశ్వనాథ సత్యనారాయణ గారెక్కడ? మనమెక్కడా? వారి ప్రతిభతో, బిరుదముతో మనకు సామ్యమా?  ఇది ఎంతవరకు సమంజసమో?  పెద్దలు ఆలోచించాలనీ మనవి చేసుకుంటున్నాను. పెద్దలు అన్యధా భావించకుంటే,నా అనుభవం ఒక్కటి చెబుతాను.  
నాకు కూడా కొందరు సాహిత్య సంస్థల వారు  కవిరత్న, సాహితీరత్న, బాసాహిత్యరత్న  బిరుదాలిస్తామన్నారు.  అప్పుడు తీసుకోవాల్సిన  నేను కూడా ఆలోచించాను. అమ్మబాబోయ్‌! నేను కవినే, కానీ, అంత పెద్దకవిని గాను.  టీచర్‌గా నా వృత్తిధర్మాన్ని నిర్వహిస్తున్నాను. కానీ,  రత్న బిరుదు పొందేటంత గొప్ప వాడిని కాదండీ! అంటూ సున్నితంగా తిరస్కరించడం జరిగింది.  ఇందులో ఇంకా నాకు కోపము తెప్పించిన విషయము ఏమిటంటే...... నేను.. ఆ సభకు వెళ్ళలేదని, ముగ్గురు సంస్థల వారు.... నాకు తెలిపిన బిరుదముతోనూ.... నా బ్లాగులలో ఉన్న నా ఫోటో, చిరునామాలను ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసి వాటితో  పొందుపరచిన సన్మాన పత్రమును (సర్టిఫికెట్ ) నాకు పోస్టులో పంపినారు...  నేను ఆవేశముతో ఒకరు పంపినపుడు చించి వేశాను.  రెండవ వారు పంపినది... ల్యామినేషన్ తో పంపడం వలన చించడానికి వీలు కాలేదు.. కత్తెరతో ముక్కలు ముక్కలు చేసి పడేశాను. మూడవది కూడా ల్యామినేషన్ తోనే పంపినారు. అయితే దానిని కత్తిరించబోతుంటే ఒక ఆలోచన వచ్చింది.. ఇలా అన్ని పడేస్తే.. భవిష్యత్తులో... ఎవరైనా నేనిలా తిరస్కరించాను, కత్తిరించాను అంటే నమ్మడానికి ఒక్కటైనా ఉంటే మంచిదని భావించి... ’బాలసేవక్ ’ అన్న బిరుదున్న దానిని మాత్రం.....దాచినాను.. కాని, ఆ పేరును నేను వాడుకోను.... బిరుదము అంటే... అంత చులకనైపోయినది.. చూశారా?
ఇలా  అమ్మభాషకు, మన ప్రాచీన కవులకు అవమానం జరుగరాదన్నది నాకోరిక. మనం చేసే పనుల  వలన మన  తెలుగు తల్లి అవమానపడరాదు..  తెలుగు వెలగాలి. పండితుల గౌరవం పెరగాలి. అందుకే నేను నేర్చే ప్రతి విషయాన్ని నా విద్యార్థుకు నేర్పిస్తూ తృప్తిని అనుభవిస్తున్నాను. విద్యార్థులతో నా అనుబంధాన్ని  మద్దిరాల శ్రీనివాసులు పేరుతో యూట్యూబ్‌ లో, బ్లాగుల్లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తున్నాను.
 చివరగా ఒక్క మాట. 3) తెలుగు  వెలుగుకై కృషిని సల్పుతున్న మహానుభావులకు, సంస్థలకు మన:పూర్వక అభినందనలు తెలుపుతూ చిన్న మనవి ఏమిటంటే, ....  మీరు సాగిస్తున్న ఈ కృషి  గ్రామీణ స్థాయి వ్యక్తులకు, పాఠశాల స్థాయి విద్యార్థులకూ కూడా  చేరువ చేయగలిగేలా.. మీమీ కార్యక్రమాలు, కార్యకలాపాలు ఉంటే బాగుంటుందని నా భావన.  అలాంటి తెలుగు అభివృద్ధి కార్యక్రమాలలో మన విద్యార్థులను కూడా భాగస్వామ్యులను చేయగలిగితే, మన తెలుగు యొక్క ఖ్యాతి విశ్వవ్యాపితమౌతుందని నేను భావిస్తున్నాను.            
ఈ అవకాశం ఇచ్చిన వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా వంగూరి చిట్టెన్‌రాజుగారికి, ఈ సంస్థ ప్రతినిధులకు, నేటి కార్యక్రమ నిర్వాహకులకు, నేటి కార్యక్రమంలో పాల్గొన్న సాహితీ మిత్రులకు, మొన్న ఈ వేదికలో మేము నిర్భయంగా మాట్లాడేందుకు... డెమో నిర్వహించిన మంగిపూడి రాధిక గారికి, నేటి మా వేదిక నిర్వాహకురాలు... సుచిత్రామూర్తి గారికి, సాంకేతిక బృందానికి  మన:పూర్వక  కృతజ్ఞతలు తెలుపు కుంటూ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. 



హైదరాబాద్ లోని ఒక సంస్థ వారు.... నిర్వహించిన గేయాల పోటీలలో ఎంపికైన నా గేయం/పాట




నేను గత 15 సంవత్సరాలుగా  2005 నుండి బాల గేయ కవిత్వం ప్రారంభించినాను. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అవసరమైన వివిధ అంశాలపై దాదాపు 100 గేయాలకు పైగా రచించినాను.  12 సంవత్సరాల నుండి పద్య రచన చేయుచున్నాను.  మూడు సంవత్సరాలుగా కథా రచనను సాగించుచున్నాను. అలాగే  కొన్ని పిల్లల నాటికను, కొన్ని వ్యాసాలను కూడా వ్రాశాను.  రెండు గేయసంపుటులను, మూడు శతకాలను, ఒక పద్య గ్రంథాన్ని, ప్రచురింపజేశాను. 
అలా ఇప్పటికి వరకు రచించిన గేయాలు దాదాపు 100కు పైన, పద్యాలు 2000 కు పైగా,  వ్యాసాలు20 వరకు , కథలు 60 వరకు ఉన్నాయి. ఇవి కాక వచన కవితలు, కథానికలు, వ్యాసాలు, ఏకపాత్ర, లాంటి వివిధ రచనా ప్రక్రియలను చేయడం జరిగినది.  పద్యరచనా విధానమును ఒక పుస్తకముగా సులభ శైలిలో రచించడమైనది. 
రేడియోలో కథలు, కథానికలు, పద్య రచను దాదాపు 15కు పైగా ప్రసారం కాబడ్డాయి. దూరదర్శన్‌ ద్వారా కూడా అనేక సమస్యాపూరణు ప్రసారం కాబడినాయి. 
వాట్సాప్‌ ద్వారా 5 మంది ఉపాధ్యాయులకు పద్యరచన నేర్పించి కవులుగా పరిచయం చేశాను. ఇద్దరు శతకాలను కూడా ప్రచురించారు. 
ఇంకనూ..... 
బాలల  కోసమై నేను రచించిన గేయాలను ‘‘బాలగేయాలు’’ పేరిట రెండు సంపుటములుగా 2005వ సంవత్సరములో ముద్రించడమైనది. మొదటి సంపుటమును నా మాతృమూర్తి శ్రీమతి మద్దిరాల రామలక్షమ్మ కు అంకితము చేయడమైనది. మొదటి శతకము ‘‘సుబ్బరాయ శతకము’’ అను ఆటవెది పద్యాలతో నా నీతిబాటకు ఆదర్శ ప్రాయుడైన నా తండ్రి”మద్దిరాల వెంకట సుబ్బరాయుడు’కు అంకితం చేసినాను. 2006 వ సంవత్సరం నుండి నా’లుగు సార్లు మా ఇంటి ఇలవేలుపు అయిన శ్రీ వేంకటేశ్వర స్వామిపై భక్తితో, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తురాలు గోదాదేవి గార్ల పేరున ‘ శ్రీ వేంకటేశ్వర దండకము, శ్రీ గోదాదేవి దండకము’ ను రచించి, నా స్వంత ఖర్చుతో ముద్రించి పులువురు భక్తులకు ఉచిత పంపిణీ చేసినాను.
రెండవ బాలల గేయ సంపుటిని నా శ్రీమతి అనువాలశెట్టి వెంకట లక్ష్మీసులోచనకు అంకితం ఇచ్చినాను. తదుపరి ఆగష్టు 2007 న నా విద్యార్థుల కోసమై పొడుపు కథలను పద్యాలుగా రచించిన ‘‘బాలరాజ శతకము’’ ను నా అన్నవదినలు మద్దిరాల వెంకటేశ్వర్లు, సుశీల   లకు అంకితం ఇచ్చినాను.
2010వ సంవత్సరములో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు నాకు విద్యలు నేర్పిన గురువులకు అంకితంగా వివిధ ఛందస్సులో రచించిన పద్యాల తోరణం, పద్య సమస్యాపూరణ ‘‘సరసానందహరి’’ అవిభక్త ఆంధ్రరాష్ట్రంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము వారి ఆర్థిక సహకారంతో ముద్రింపజేసినాను.
2011వ సంవత్సరంలో నాకు పద్యము నేర్పిన గురువు ‘శ్రీమంత్రి సీతారామయ్య’’ దంపతులకు అంకితంగా కంద పద్యాలతో రచించిన ‘రామశతకము’ అనే నీతి పద్య శతకంను ముద్రింపజేశాను. 
2012వ సంవత్సరం నుండి 8 సంవత్సరాలుగా ‘బాలవికాసం’ పేరుతో  ఒక పాఠశాల త్రైమాస పత్రికను ప్రాథమికోన్నత పాఠశాల, కంకణాలపల్లి, త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా నుండి 30 సంచికలను ప్రచురింపజేశాను. 
కృష్ణా జిల్లా తెన్నేరు లోని శ్రీ దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్‌ అధినేత శ్రీ దేవినేని మధుసూదనరావు గారు నా విద్యార్థులకు నేను చేయిచున్న సాహితీ సేవను, బోధనా పద్ధతులను  గుర్తించి, పరిశీలించి నా విద్యార్థుల పుస్తక సమీక్షలను, వ్యాసాలను, పద్యాలను, చిత్రలేఖనముతో మా పాఠశాల పేరుననే ‘‘కంకణాపల్లి విద్యార్థుల సాహితీ ప్రతిభ’’ పేరుతో ఒక 60 పేజీల పుస్తకమును 2000 కాపీలుగా ఏప్రిల్‌ 2015 న ముద్రించి విద్యాసంస్థలకు, అధికారులకు, ప్రముఖ సాహితీ వేత్తలకు , ఉపాధ్యాయులకు పంచిపెట్టినారు.
పిల్లలకు నేర్పుతున్న ఈ నా బోధనా సాహిత్య విధానమును ‘‘ తరగతి రాజ్యాంగము’’ పేరున ఒక చిన్న పుస్తకమును కూడా నా స్వంత ఖర్చులతో సెప్టెంబర్‌ 2017న ..అచ్చు  వేయించాను. ఇదే సంవత్సరములో నా బోధన , సాహిత్య కృషిని గమనించి ప్రకాశం జిల్లాలోని ఒక సంస్థ ‘కళామిత్రమండలి, ఒంగోలు’’ వారి నుండి 2017వ సంవత్సరానికి ‘‘గిడుగు సాహితీ పురస్కారాన్ని,  అందుకున్నాను. 
నా విద్యార్థులచే కూడా కథారచనలతో పాటు వివిధ రచనా ప్రక్రియలను నేర్పించినాను. వారి చిరు కథలను వివిధ పత్రికలకు పంపిస్తూ ఉండేవాడిని. అవి ప్రచురితమయ్యేవి.  
అలా మా పాఠశాలోని 5,6,7 తరగతుల విద్యార్థులచే  అలా ప్రచురింప బడిన 22 కథలను ‘‘విరిసిన మొగ్గలు ’’ పేరిట 2018వ సంవత్సరములో ‘‘అనంతపురం, గాయత్రి ప్రచురణలు ’’ అధినేత శ్రీ జూటూరు తుసీదాస్‌ గారి కొంత ఆర్థిక సహకారంతో పుస్తకంగా ప్రచురించాను. ఈ పుస్తకమునకు 2019నకు గాను తెలంగాణ లోని డా॥చింతోజు బ్రహ్మయ్య బాలామణి మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వారి ‘బాలప్రతిభా పురస్కారము’ కూడా అందుకోవడం జరిగినది.
2019లో విశాలాంధ్ర పబ్లికేషన్స్‌ వారు నేను రచించగా పలు పత్రికలలో ప్రచురింపబడిన కథలను కొన్నిటిని ‘నగరదిష్టి’’ పేరున ఒక సంకలనమును ముద్రించడం జరిగింది. అది నా ముద్దుల కుమారులు వెంకట రామ్‌ప్రకాష్‌, వెంకట తరుణ్‌ ప్రదీప్‌లకు అంకితము ఇవ్వడం జరిగినది. 
40కి పైన కథలను వివిధ పత్రికలలో ప్రచురింపబడినాయి. కొన్నిటికి అవార్డులు కూడా వచ్చాయి. పలు సంస్థల నుండి ప్రశంసలు,  సన్మానాలు కూడా అందుకున్నాను.
1.జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము, 2.మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము, 3.జిల్లా ఉగాది పురస్కారము, కలెక్టర్, ఒంగోలు, 4.మహాత్మా గాంధీ పద్యరచనా పురస్కారము,విజయవాడ రాష్ట్ర స్థాయి తృతీయ బహుమతి, 5. ప్రభుత్వ పుస్తక రచనా సభ్యునిగా, 6.ఎయిర్ ఇండియా బోల్ట్ అవార్డు,ముంబయ్,  7.తెలుగు వెలుగు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము, 8.ఆల్ ది బెస్ట్ అకాడెమీ, హైదరాబాదు,  వారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము, 9.గురజాడ పురస్కారము,10. ప్రకాశం జిల్లా రచయితల సంఘం,11. ప్రకాశం జిల్లా శ్రీ కృష్ణదేవరాయ సాహీతీ సంస్థ పురస్కారము, 12.ఆనందమయి సాహితీ సంస్థ పురస్కారము, 13.జిల్లా తెలుగు వికాస పురస్కారము, రామ్ కీ ఫౌండేషన్ వారి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము, 14.తెలుగు ప్రపంచ సభల పురస్కారము, 15.ఒంగోలు శాంతివనం ఫౌండేషన్ వారి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము,16. అద్దంకి జానపద కళాపీఠము వారి పురస్కారము, 17.న్యూఢిల్లీ వారి జాతీయ స్థాయి గ్లోబల్ రోల్ మోడల్ టీచర్ అవార్డ్, 18.చిలకలూరి పేట రావూరి భరధ్వాజ పీఠము వారి పురస్కారము, 19.ప్రజ-పద్యం , గుంటూరు, 20.గోలి వెంకట్రామయ్య రాష్ట్ర స్థాయి ఉత్తమ కథా పురస్కారము, 21.రాష్ట్ర స్థాయి రంజని, విశ్వనాథ పద్య పురస్కారము, హైదరాబాద్, 22.రాష్ట్ర తెలుగు బ్రహ్మోత్సవాల పురస్కారము, కలెక్టర్ , ఒంగోలు, 23.అమరావతి బాలోత్సవ్, విజయవాడ, 24.సృజన సాహితీ సంస్థ, అద్దంకి, 25. కళామిత్రమండలి, ఒంగోలు వారి గిడుగు సాహితీ పురస్కారము, 26. నవ్యకవితా కళానిధి, శ్రీ బి.వి.వి.శాస్త్రి స్మారక పురస్కారము, ఒంగోలు

నేను చేస్తున్న వృత్తి సంబంధమైన కృషిని, సాహితీ కృషిని పరిశీలిస్తున్న మిత్రులు, ఒంగోలు వాసి కవి, ఉపాధ్యాయుడు శ్రీ భువనగిరి పురుషోత్తంగారు, కీర్తి శేషులైన వారి అన్నగారి జ్ఞాపకార్థం ప్రథమంగా ప్రారంభించిన పురస్కారమును,  తేది:20`10`2019న రాష్ట్ర స్థాయిలో శ్రీ బి.వి.వి. శాస్త్రి స్మారక సాహితీ పురస్కారముతో పాటు,   ‘‘నవ్యకవితా కళానిధి’’ బిరుద సత్కారమును నాకు అందించడం మహదానందం. 
నాకు సంబంధించిన ఈ విషయాలన్నిటినీ www.maddiralasreenivasulu.blogspot.com అను బ్లాగు సంకలినిలో ప్రదర్శిస్తున్నాను. 
అలాగే నా విద్యార్థుల రచనల పత్రిక ‘బాలవికాసం’ పత్రికలో ప్రచురింపబడిన పిల్లల కథలను www.baalavikaasam.blogspot.com అనే బ్లాగులో ప్రదర్శిస్తున్నాను. 
ఇంకా.... విద్యార్థులకు నేను నేర్పిస్తున్న వివిధ విషయాలను వీడియోల రూపములో MADDIRALA SREENIVASULU అనే పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రవేశపెడుతున్నాను. ఇప్పటి వరకూ 140 వీడియోలను అప్‌లోడ్‌ చేశాను. ఆ ఛానల్‌కు సబ్‌స్క్రైబర్ల సంఖ్య 600 దాటింది.  
ఈ విధమైన క్రమములో నేను ఇప్పటి వరకు చేసిన రచనా ప్రక్రియలు, 1. పద్యము, 2.గేయము, 3.పద్యకథ,4. గేయకథ, 5.వ్యాసము, 6.పిల్లల నాటిక, 7.వచన కవిత్వము, 8.నానీలు, 9.పేరడి పాటలు, 10.ఏకపాత్ర, 11.చిరు నవల, ( త్రిపురాంతక క్షేత్ర మహిమ అనే పిల్లల సంభాషణలతో కూడిన చారిత్రక నవల-2020) ,12. మణిపూసలు,13. ఇంగ్లీష్ రైమ్స్, 14.జానపదగేయాలు, 15.ప్రతిజ్ఞలు, 16.దండకములు, 17.కథలు, 18. కథానికలు, 19.సమస్యాపూరణము 20.అభ్యుదయ గేయము 






నాకు ప్రకటించిన బాలకవితా పురస్కార ధనము, పురస్కార పత్రము, బాల రచయితల ప్రశంసా పత్రములు పంపిన సంస్థ నిర్వాహకులు శ్రీ అశోక్ గారికి ధన్యవాదములతో.....  dt:29-09-2020








5 సెప్టెంబర్ 2018 న ఒంగోలు లో


తేది:19-07-2020, ఆదివారము సాక్షి సండే బుక్ లో నా కథల పుస్తకంపై సమీక్ష

తేది: 21-06-2020 , ఆదివారము, ఫాదర్స్ డే సందర్భముగా... నా అంతరంగాన్ని మిత్రుడు శ్రీ కే.సి.హెచ్.వి.సుబ్బారావు ... "ఓపెన్ హార్ట్ విత్ కే.సి.హెచ్.వి" పేరుతో ఆవిష్కరించిన సందర్భముగా..... ఈ వీడియో రూపంలో మొత్తం... ఇంటర్వ్యూ...... చూస్తూ వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


ఏమే పిల్లా రంగన్నపిల్లా... అనే జానపదగేయం.. .మ్యూజిక్ తో... క్రింద వీడియో..





తేది:17-05-2019 న , శుక్రవారము, చోళవీడు ప్రాథమిక పాఠశాల లో అచ్చనాల రమాదేవి అనే ఉపాధ్యాయురాలు విద్యార్థులలో తెలుగు భాషాభివృద్ధికై చేస్తున్న కృషిని గురించి తెలుసుకుంటున్న సందర్భం.. ఈనాడు ప్రకాశం జిల్లా వార్త.







ఇంటి పరిస్థితుల కారణంగా.. ఓ తండ్రి బడికి వెళ్తున్న తన కూతురును బడి మాన్పించాడు.. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఓ ఉపాధ్యాయుడు ఆ ఊరికి కొత్తగా వచ్చారు.. ఆయన ఆ అమ్మాయిని తిరిగి బడిలో చేర్పించడానికి విశ్వప్రయత్నం చేశాడు... అయితే..... ఆ ఉపాధ్యాయుని ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరయిందా? చిగురించిన మొలక అయిందా?....... ఈరోజు "ప్రజాశక్తి" సండే మ్యాగజైన్ "స్నేహ"... 15,16 & 17 పేజీలలో నా రచన... "ఎల్లమ్మ MPDO" కథ.                                                              ===============================================


తేది:23-12-2018,"వార్త" సండే మ్యాగజైన్ 32వ పేజీలో ప్రచురితమైన నా పేరడీ రచన  
UTF "ఐక్య ఉపాధ్యాయ" మాసపత్రిక... డిశంబర్ 2018 సంచికలో నా వ్యాసము 
గుంటూరు ఎస్.ఐ. గారి కోరిక మేరకు నేను రచించిన ప్రతిజ్ఞ
నేటి సాక్షి సండే బుక్ లో నా కథ "మారు పేరు"
"









సెప్టెంబర్ 2019 "భావతరంగిణి" సంచిక లో "మహంతీరాజ్యం" కథ.... 



























 "ప్రాథమిక స్థాయిలో అర్థవంతమైన ,ఉపయోగకరమైన బోధన" అనే అంశంపై పరిశోధనా పత్రం మర్పించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంచే ప్రశంసా పత్రం అందుకున్నట్లు " ఉపాధ్యాయుడు మద్దిరాల"=====================================గాంధీ మహాత్ముడు 150వ జయంతి సందర్భంగా నయీ-తాలిమ్ విద్యా విధానం పై రెండు రోజుల జాతీయ సదస్సు , బాపట్ల మానవ వనరుల అభివృద్ధి సంస్థ  కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమములో ఆంద్రప్రదేశ్ విద్యా శాఖా మంత్రి శ్రీ ఆది మూలపు సురేష్ గారు, SSA State Project Directer, వాడ్రేవు చినవీరభద్రుడు, SIEMAT డైరెక్టర్, శ్రీ విశ్వనాథప్ప ,నయీ తాలిమ్ దక్షిణ భారతదేశ కో ఆర్డినేటర్ Dr. సీఏ ప్రసాద్ పాల్గొన్నారు. ఇందులో జాతీయ స్థాయిలోని తమ తమ పాఠశాలల్లో ఉత్తమ బోధనను అందించే కొందరు ఉపాధ్యాయులచే వారి బోధనా విధానమును గురించి వివరించేందుకు పలువురు ప్రభుత్వము వారిచే ఆహ్వానింపబడ్డారు.. అందులో త్రిపురాంతకం మండలం కంకణాలపల్లిలో పనిచేయుచున్న ఉపాధ్యాయుడుని కూడా తన నయి-తాలిమ్ బొధనావిధానమును వివరించేందుకు ఆహ్వానము అందినది.  ఈ మేరకు వీరు "ప్రాథమిక స్థాయిలో అర్థవంతమైన ,ఉపయోగకరమైన బోధన" అనే అంశంపై పరిశోధనా పత్రం సమర్పించడం జరిగినది. అంతేకాక ఈ సందర్భముగా  తన బోధనావిధానముతో కూడిన వీరు రచించిన "తరగతి రాజ్యాంగము" అనే పుస్తకమును కూడా విద్యామంత్రి గారు తన స్వహస్తాలతో అందరి సమక్షములొ ఆవిష్కరించడం జరిగింది. తరగతి గదిలో కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహించే విధులు, కర్తవ్యాల లాంటివే భారత రాజ్యాంగం లోని విషయాలు అని తెలిపిన మద్దిరాల శ్రీనివాసులు బోధనావిధానము ప్రశంసించదగినది.. ఇలాంటి ఉపాధ్యాయులే రేపటి జాతి నిర్మాతలంటూ ఈ సందర్భముగా మంత్రి కొనియాడారు.. ఇందుకు గుర్తుగా spd గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రము కూడా అందజేయడమైనది. ఇందులో MLC విఠపు బాలసుబ్రమణ్యం,  కూడా పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఉపాధ్యాయుడు మద్దిరాలను మండల విద్యాశాఖాధికారి శ్రీ మల్లికార్జున నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించడమైనది.==========dt:27,28 SEPTEMBER 2019=====




"నయీ-తాలిమ్" బోధన విధానంపై పత్రం సమర్పించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంచే ప్రశంసా పత్రం అందుకున్నట్లు " ఉపాధ్యాయుడు మద్దిరాల"
============
గాంధీ మహాత్ముడు 150వ జయంతి సందర్భంగా నయీ-తాలిమ్ విద్యా విధానం పై రెండు రోజుల జాతీయ సదస్సు , బాపట్ల మానవ వనరుల అభివృద్ధి సంస్థ  కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమములో ఆంద్రప్రదేశ్ విద్యా శాఖా మంత్రి శ్రీ ఆది మూలపు సురేష్ గారు, SSA State Project Directer, వాడ్రేవు చినవీరభద్రుడు, SIEMAT డైరెక్టర్, శ్రీ విశ్వనాథప్ప ,నయీ తాలిమ్ దక్షిణ భారతదేశ కో ఆర్డినేటర్ Dr. సీఏ ప్రసాద్ పాల్గొన్నారు. ఇందులో జాతీయ స్థాయిలోని తమ తమ పాఠశాలల్లో ఉత్తమ బోధనను అందించే కొందరు ఉపాధ్యాయులచే వారి బోధనా విధానమును గురించి వివరించేందుకు పలువురు ప్రభుత్వము వారిచే ఆహ్వానింపబడ్డారు.. అందులో త్రిపురాంతకం మండలం కంకణాలపల్లిలో పనిచేయుచున్న ఉపాధ్యాయుడు మద్దిరాల  కూడా ఒకరు. ఈ మేరకు వీరు "ప్రాథమిక స్థాయిలో అర్థవంతమైన ,ఉపయోగకరమైన బోధన" అనే అంశంపై పరిశోధనా పత్రం సమర్పించడం జరిగినది. అంతేకాక ఈ సందర్భముగా  తన బోధనావిధానముతో వీరు రచించిన "తరగతి రాజ్యాంగము" అనే పుస్తకమును విద్యామంత్రి ఆవిష్కరించి అభినందించారు.
"మిసిమి" మాసపత్రిక లో 2014లో ... నా గురించి.. 



అసలు original గా నేను రాసియున్న సమీక్ష... క్రింద ఇవ్వబడినది... పై పత్రికలో.. వచ్చిన రెండవ సమీక్ష... వ్రాసినది.. మా పాఠశాల సహచర ఉపాధ్యాయుని శ్రీమతి ఎస్. జ్యోతి, హింది పండిట్.

భావతరంగిణి పత్రిక. ఎడిటర్ శ్రీ రమణారావు గారు సతీసమేతంగా మా ఇంటికి తేది:25-10-2019న మా ఆహ్వానం మేరకు వచ్చినారు. వారికి ఆతిథ్యము ఇచ్చే అవకాశము మాకు కల్పించినారు.. అయితే  మా దంపతులము ఇచ్చిన చిరు ఆతిథ్యానికే ఈ విధంగా మాపై వారి అభిమానాన్ని.నవంబర్ 2019 సంచిక లో ప్రకటించడం ఆశ్చర్యం, ఆనందదాయకం. సదా కృతజ్ఞులం. పెద్దల ఆశీర్వాదం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. 

నేను యిచ్చిన ఆలోచన మేరకు ప్రముఖ జాతీయ స్థాయి కార్టూనిస్ట్ , నా మిత్రుడు వెంటపల్లి సత్యనారాయణ వేసిన కార్టూన్.....


ఆంధ్రప్రభ దినపత్రిక.. తేది:08-05-2020, శుక్రవారము నాడు ప్రకాశం జిల్లా ఎడిషన్ లో నా కవిత